జిల్లా పోలీసు కార్యాలయంలో డా" బిఆర్. అంబెడ్కర్ జయంతి వేడుకలు

వనపర్తి (ఆయుధం న్యూస్)  భారత రాజ్యాంగ నిర్మాత  డా"బి"ఆర్" అంబేద్కర్ 129వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి కె,అపూర్వరావుips  
డా"బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన  మహానీయుడని కొనియాడారు.
అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్,
డిసిఆర్బి సిఐ, జమ్ములప్ప, 
స్పెషల్ బ్రాంచ్ ఎస్సై,
వెంకట్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.