
వనపర్తి (ఆయుధం న్యూస్) : వనపర్తి టౌన్ లో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజు, అధ్యక్షులు అయిత కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి ఎలిశెట్టి వెంకటేష్, నాయకులు కె కె మూర్తి,కే. శ్రీధర్ ,పాలాది శ్రీనివాసులు ,వి. సాయి బాబా ,మహిళా సంఘం అధ్యక్షురాలు కొండూరు మంజుల పురుషోత్తం, కటకం భారతి పాల్గొన్నారు.