శా యి నిపల్లి గ్రామాన్ని సందర్శించిన అధికారులు...

బిజినపల్లి  (ఆయుధం  న్యూస్) మండలంలోని శా యి ని పల్లి గ్రామాన్ని బిజినపల్లి ఎంపీడీవో హరినాథ్ గౌడ్, తాసిల్దార్ అంజి రెడ్డి, ఎంపీవో రాములు నాయక్ లు సందర్శించడం జరిగింది.సర్పంచి అవంతి గారితో గ్రామంలో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. బాంబే,మహారాష్ట్ర నుంచి వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏఎన్ ఎమ్ రమణమ్మ తో పూర్తి విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో దాదాపు 15 కిరాణా షాపులు ఉన్నాయని వివరించడం జరిగింది వివరణ అధిక రేట్లకు అమ్ము తే తక్షణమే తెలియజేయాలని అధికారులు వివరించారు.. అలాగే దుకాణం దగ్గర వెల్లి స్టాకు వివరాలను సేకరించడం జరిగింది. రేట్ల విషయాలను అడిగి తెలుసుకున్నారు, రేట్ల పట్టిక ను షాపు బయట వేయాలని దుకాణా యజమానులకు చెప్పడం జరిగింది.అధిక రేట్లకు  విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుకాణదారులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బిసం కురుమూర్తి, కారోబార్ సురేష్, వాటర్ మెన్ దస్తగిరి తదితరులు ఉన్నారు