యధావిధిగా ప్రజావాణి కార్యక్రమము

 గద్వాల్ : రేపు జరగబోయే ప్రజావాణి కార్యక్రమము మరియు డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమము యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు డైల్ యువర్ కలెక్టర్  కార్యక్రమమునకు 08546 - 274001 నెంబర్కు కాల్ చేసి ఉదయము 10 గంటల నుంచి 10:30 వరకు తమ ఫిర్యాదులను టెలిఫోన్ ద్వార తమ ఫిర్యాదులు ఇవ్వవచ్చు అన్నారు. 10:30 నుంచి ఒకటిన్నర వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.