ఇంకా ఎవరెవరితో మాట్లాడింది అనే కోణంలో


రంగారెడ్డి: జిల్లాలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. పంక్చర్‌ షాపు దగ్గర సీసీ టీవీ ఫుటేజ్‌ని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. ప్రియాంక రెడ్డి స్కూటీకి కావాలనే పంక్చర్‌ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియాంక చివరిసారిగా చెల్లి భవ్యతో కాకుండా.. ఇంకా ఎవరెవరితో మాట్లాడింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని దుండగులు ప్రియాంక రెడ్డి‌ని హత్యచేసి సజీవ దహనం చేశారు. షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

 పూర్తి వివరాలు: 

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ప్రియాంక వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామం ఆమె స్వస్థలం .. ప్రస్తుతం శంషాబాద్‌లో వీరి కుటుంబం నివసిస్తున్నట్టు సమాచారం. నిన్న మాదాపూర్‌లోని హాస్పిటల్‌కు ప్రియాంక స్కూటీపై వెళ్లింది. రాత్రి 9.30 ప్రాంతంలో శంషాబాద్‌కు తిరిగొచ్చింది. అప్పటి నుంచి ప్రియాంకరెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్టు పోలీసులు గుర్తించారు.

ఉదయం 4.30 గంటల సమయంలో ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ప్రియాంక స్వస్థలం కొల్లాపూర్‌ మండలం నర్సాయిపల్లి. స్కూటీ పాడయిందని కుటుంబ సభ్యులకు ఆమె ఫోన్‌లో చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రియాంకను కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. తన స్కూటీ పంక్చర్ అయితే చటాన్‌పల్లి వద్ద ఆగిందని తెలుస్తోంది. దీంతో భయపడుతూ ప్రియాంక తనకు ఫోన్‌ చేసిందని, అక్కడి స్థానికులు స్కూటీని రిపేర్‌ చేయిస్తామని తీసుకెళ్లి.. దుకాణాలు మూసి ఉన్నాయని మళ్లీ తీసుకొచ్చారని తనకు చెప్పిందని, అక్కడ లారీ డ్రైవర్లు తిరుగుతూ ఉండటంతో భయంగా ఉందని చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాకు తెలిపారు. అక్కడే ఉండవద్దని సమీపంలోని టోల్‌గేట్‌ వద్దకు వెళ్లమని తాను చెప్పినా.. వెళ్లలేదని, ఈ నేపథ్యంలో తన చెల్లెలు తిరిగిరాకపోవడం, ఇంతలోనే ఈ ఘోరం జరగడం తమను కలిచివేస్తోందని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు.

గుర్తుతెలియని దుండగులు ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. రాత్రి తన సోదరికి ఫోన్‌ చేసి భయమేస్తుందని చెప్పింది. తన బైక్‌ పంక్చర్‌ అయ్యిందని, తన చుట్టూ కొందరు లారీ డ్రైవర్లు ఉన్నారంటూ చెప్పి ఫోన్‌ పెట్టేసింది. ఆమె సోదరి అందించిన వివరాల ప్రకారం.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 15 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. శంషాబాద్ డీసీపీ బృందం నిందితుల కోసం గాలిస్తున్నారు..