మీ శ్రేయోభిలాషి.. Part -9


అన్ని రంగాలలో వెళ్లునుకుపోయినఈ దోపిడీ స్వామ్యాన్ని పెరికివేయడానికి రెండు చేతులు సరిపోవు. వేలాది చేతులుకావాలి. కావున నాయకుడు నిజాయితీపరుడైతే అతనిక్రింద పనిచేసే వారన్తా తప్పక నిజాయితీ పరులవుతారు. నాయకుడు మంచివ్యక్తులను ఎంచుకొని వారికి ధర్మాధర్మాల గురించి వివరించాలి. మనిషైపుట్టినవాడు తప్పక నీతి నియమాలు కలిగివుండాలి. స్పృహను కలిగివుండాలి. అలాంటి వ్యక్తులను తయారుచేయాలి. వారంతా కూడా సమాజంలో అన్నిచోట్లా ధర్మం గురించి వివరించాలి. మనుషులు తమమనసులకు అంటుకున్న పాపపంకిలాన్ని కడిగేసుకొనేట్లు మార్చాలి. మనిషి తానేమిటో తెలుసుకొనేట్లు చేయాలి. ఈ మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ లభించదు. కాబట్టే ఈ జన్మలో మంచిమాత్రమే చేయాలి అన్న నిజాన్ని గ్రహించాలి. ఓ వైపు నాయకుడు నిజాయితీగా మారాలి మరోవైపు మనిషికూడా కూడా నిజాయితీగా మారాలి. ఇలా ప్రతి మనిషీ నిజాయితీగా మారితే ఒక సమాజం దేశం ఎంతో స్వచ్చంగా మారిపోతారు. మనకుకావలసింది ఇదే.మనిషి జీవితకాలంలో కోట్లాది రూపాయలు సంపాదించినా రోజూ తినగలిగినంత మాత్రమే తింటాడు. మరణించినప్పుడు సంపాదించిన ఆ డబ్భునంతా వెంట తీసుకుపోలేడు. డబ్భు యాసమున్న ప్రతి ఒక్క రాజకీయనాయకుడు ఈ నగ్న సత్యాన్ని గ్రహించాలి.

భారత దేశంలో ఉన్న అవినీతిని పారద్రోలడానికి ఇప్పుడు మనం నరేంద్రమోడీ మీద దృష్టి పెట్టాం. ఆయనఒక్కరు ఏమి చేయగలరు? మనమంతా వాస్తవంగా పూర్తి స్వార్థపరులం. కేవలం నేను నాకుటుంబం బాగుండాలి అని గిరి గీసుకొని కూర్చున్నాం. ఏదైనా చేయాలంటే ఇతరులమీద దృష్టి పెడతాం. వాళ్ళు చేయాలి లేదా ఫలానా వాళ్ళు చేయాలి అంటాం. రోడ్డుపైన రాళ్లు పడి ఉన్నాయని అనుకొందాం. వాహనాలు నిరాటంకంగా వెళ్ళడానికి అవి అడ్దన్కి. వాటిని మనం చూస్తాం. దానివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనకు తెలుసు. కానీ మనం ఆరాళ్లను తీసివేయం. ఎందుకు?ఆదిమానపనికాదు. అది వేరే డిపార్ట్మెంట్ పని అని నిమ్మకుండిపోతాం. మనకు దెబ్బ తగిలినప్పుడు తప్ప ఇలాంటివి తొలగించాలని అనుకోము. సమాజంలో ప్రతిఒక్కటీ అంతే.లంచం గురించికూడా అంతే. మనపని తొందరగా చేయించుకోవడానికి మనం లంచం ఇస్తాం. ఇలాగే అందరూ అనుకొంటారు. (సశేషం)