మీ శ్రేయోభిలాషి - Part 7

Part -6 ( తరువాయి )
కేవలం ధన దాహంతో అధికారదాహంతో రాజకీయాల్లో చేరి డబ్భు సంపాదనే పరమావధిగా పనిచేసే రాజకీయ నాయకులు మనదేశంలో కోకొల్లలు. పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు కూడా రాజకీయ నాయకులు పంచన చేరి కోట్లకు పడగలెత్తి ప్రజాసేవను అపహాస్యం చేస్తున్న ఉదంతాలు మనదేశంలో కోకొల్లలుగా బయటకు వస్తున్నాయి. 

అంటే పదవిలోకి వస్తే చాలు ఇక డబ్బు సంపాదన అనే ప్రక్రియ మొదలవుతుందన్నమాట.ఇక వాళ్ళను ఎవరు ఆపగలరు? మనిషి అనేవాడు ఎలా ఉండాలో రామాయణ మహాభారత భాగవత పురాణాలు ఎంతో చక్కగా చెబుతున్నాయి. వాటిని ఈ నాయకులు అధికారులు చదువుకోలేదా? పుస్తకాలు లేవా? మంచీ చెడు మానవత్వం ఇవేవి వాళ్ళు చదవకుండానే అధికారులు నాయకులు అయిపోయారా? వారి ఇండ్లల్లో తల్లి దండ్రులు ఆమాత్రం కూడా నేర్పలేదా? రాక్షసుల్లా జనం మీదపడి దోచుకోవడమే వారు నేర్చుకొన్న విద్యానా?

ఇప్పుడు నరేంద్రమోడీ గురించి ఆలోచన చేద్దాం. ఆయన ఒక ఆఫేర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని అనిలిస్తోంది. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా దశాబ్దం పైగా పరిపాలన చేశారు. పదేళ్లకాలంలో ఏదైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేసిన ఏ వ్యక్త్తి అయినా అంతో ఇంతో వెనుకేసుకొంటారు. కానీ నరేంద్రమోడీని చూస్తే ఒక్క పైసా కూడా వెనుకేసుకొన్నట్లు ఎలాంటి ఆరోపణలు లేవు. అంటే ఆయన నిజాయితీపరుడని అందరూ అంగీకరించినట్లే. ఆయన ముఖ్యమంత్రి గా ఉంటె ఆయన కుటుంబసభ్యులు అధికార లాంఛనాలు ఉపయోగించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇక ముఖ్యమంత్రి అనేవాడు అధికారం ఉందికాబట్టీ ప్రజాధనంతో ఎన్నో విదేశీ స్వదేశీ యాత్రలు చేస్తూ ఉంటారు. 

నరెంద్రమోడీ మాత్రం అలాంటివేమీ చేయలేదు. కుటంబ సభ్యులు ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని పక్కదారుల్లో ప్రజాధనం ప్రోగుచేశారా అంటే అదీలేదు.ఆయన ఇంకా ఎవరికైనా బినామీ పేర్లతో దోచిపెట్టేకార్యక్రమం చేశారా అంటే అదీలేదు. వెరసి నరేంద్రమోడీ ఒక విలక్షణమైన నిజాయితీగల ప్రజానాయకుడు అని చెప్పాల్సిందే. అందుకే భారత ప్రజలు ఆయన వ్యక్తిత్వాన్ని నిజాయితీపరత్వాన్నీ నిస్వార్థ రాజకీయజీవితాన్ని చూసి ఆయనకు ఓటు వేశారు. ప్రధానిగా కేవలం నరేంద్రమోడీయే ఉండాలన్న దృఢమైన భావనతో ఆయనకు ఓటు వేశారు. భారత దేశానికి ప్రధానమంత్రి మోడీయే కావాలి అన్న నిజాన్ని ప్రజలు తమ ఓటు ద్వారా నిరూపించారు. భారతదేశానికి ఇంతకాలానికి ఒక నిజమైన భారతీయుడు ప్రధానిగా వచ్చారు అన్న భావన ప్రతిఒక్కరిలో ఏర్పడింది. (సశేషం)