మన పాలకులకు ఒక యోగ్యతా లేదు. ఒక సమర్థతా లేదు. అర్హతలు అసలేలేవు...వీరి పాలన చూస్తుంటే దేశం వదలి పారిపోవాలనిపిస్తుంది. ప్రపంచంలో ఎన్నో దేశాలలో పాలకులు ఉన్నారు. చాలా దేశాలలో ఎన్నో మంచి పద్ధతులు ఉన్నాయి. కానీ మనదేశంలో అలాంటివేవీ కనిపించవు. మనది ప్రజాస్వామ్య దేశం అంటూ ప్రతి సందర్భంలోను చెబుతూవుంటాం. ప్రజాస్వామ్యమంటే ప్రతి ఒక్కరు తమకు అనుకూలమైన అర్థాన్ని మలుచుకొంటారు. ఇక నేను అనే అహంభావం హిమశిఖరమంత ఎత్తుగా ఉంటుంది. ఈ దేశంలో నేను ఏమైనా చేయగలను. ఏమైనా మాట్లాడగలను. నాఇష్టం వచ్చినరీతిలో ఉంటాను. అనే ఇలాంటి పోకడలు అధికంగా కనిపిస్తుంటాయి. దేశాన్ని పాలించడానికి ఓట్లు వేయడం అనే ప్రక్రియను ప్రారంభించింది మన ప్రజాస్వామ్యప్రభుత్వం. దేశంలో వేలాదిగా రాజకీయపార్టీలు పుట్టుకొచ్చాయి. జీవితంలో తొందరగా డబ్బు పేరు సంపాదించాలంటే రాజకీయాలొక్కటే ఏకైక మార్గం అనే వాదన మనదేశంలో బాగా వేళ్ళూనుకుపోయింది. దేశాన్ని బాగుచేయడానికో అభివృద్ధి చేయడానికో ఈ రాజకీయపార్టీలు పనిచేస్తే మంచిదేకాని నేను నాకుటుంబం నావాళ్లు బాగుపడాలి అంటే రాజకీయపార్టీ అనేదానిని ఏర్పాటు చేయాలి.
ప్రజలను మభ్యపెట్టాలి. ఓట్లు దండుకోవాలి.పదవిలోకిరావాలి. ఆ తర్వాత దరికినంతగా దోచుకోవాలి. ఇదీ మనదేశంలో జరుగుతున్న తంతు.ఎంతోమంది నాయకుల ఆస్తులు అంతస్తులు పత్రికల్లో టీవీలలో చూయిస్తుంటే ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
నేను దేశానికి వీలైనంతగా సేవ చేయడానికి ముందుకు వచ్చాను. నాకు కుటుంబం లేదు. ఆస్తి లేదు. అంతస్థు లేదు. ప్రజలే నాకుటుంబం అంటూ ప్రజలముందుకు వచ్చారు నరేంద్రమోడీ. దేశ ప్రజలు ఆయనను ప్రజలు మస్ఫూర్తిగా నమ్మారు. మోడీజీకి కుటుంబం కుటుంబసభ్యులు ఉన్నా వారెవరు ఆయన వెంట ఉండరు. ఆయననుంచి వారేమీ ఆశించరు.ఆయనకూడా వారికి సంపాదించుకోండి అంటూ దారులేమీ చూయించలేదు. చాలా నిరాడంబరంగా నిస్వార్థంగా రాజకీయాలలో తనదైన శైలిని సృస్తిన్చుకొని గుజరాత్ రాష్ట్రాన్ని ఎంతగానో వృద్ధిలోకి తెచ్చారు. పది సంవత్సరాల క్రిందట ఆయన ఆస్తి ఏమిటో భారత ప్రధాని అయ్యాకకూడా అదే ఆస్తి ఉంది. మనిషికి ఒక స్వార్థం అనేది లేకపోతే చాలు అతడు ప్రజలకు సేవచేయగలడు. ఆలక్షణం నరేంద్రమోడీ వంద శాతం ఉంది. అందుకే ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా నమ్మారు. ఆయన పార్టీకి బ్రహ్మ రథం పట్టారు.
ఎవరి సహాయము లేకుండానే మీరు దేశాన్ని పరిపాలించాలి అంటూ ప్రభుత్వం ఏర్పర్చడానికి అవసరమైన స్థానాలను ప్రజలు అందించారు.ఇక ఆయనపరిపాలన చేసే తీరు ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు.(సశేషం)