మీ శ్రేయోభిలాషి... Part -3

సంపాదించిన డబ్బులను విదేశీ బ్యాంకులలో దాచుకోవడమేమిటి? ఒకవ్యక్తి జీవితకాలం పాటు హాయిగా మూడుపూటలా తినడానికి కావలసిన డబ్బేన్తా? తనకు తన కుటుంబానికి కలిపి ఒక కోటి రూపాయలు అనుకొందాం. సరిపోయినదానికంటే కోట్లాది రేట్లు అధికంగా సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకు? యింత నిజాయితీగా ఏ నాయకుడైనా ఆలోచిస్తాడా. వక్రబుద్ధివల్లనే నేడు లక్షలాది కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోయింది. స్వాతంత్య్రం రానంతవరకు బ్రిటిష్ వారిమీద ఆక్రోశం వెళ్లగక్కారు. తెల్లదొరలు దేశంలోని ఉన్న సంపదనంతా దోచుకుపోతున్నారని. మరి స్వాతంత్య్రం వచ్చాక మనమేం చేస్తున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం ఆపనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళు పెడచెవినపెడుతున్నారు. 
ప్రజలకు ఈ భాగవతాలన్నీ తెలుసు. కానీ వారు ఎవరిని పశ్నించగలరు? వాళ్ళ కోపాన్ని ఎవరిమీద వెళ్లగక్కగలరు. వాళ్ళబాధను ఎవరిని చెప్పుకోగలరు.
 ఈ దేశంలో రాజకీయనాయకులకు ఉన్నంత అధికారం ప్రజలకు ఎక్కడిది. పదవిలో ఉంటె చాలు ఇక అతన్ని ఎవరు ఏమి చేయగలరు. చివరకు దేవుడుకూడా నిస్సహాయంగా ఉండిపోతాడు. ఈ దేశంలో ఒక వ్యక్తి ఎంపీ గానో లేక ఎమ్మెల్యే గానో ఎన్నుకోవడమే తప్ప అతన్ని తిరిగి ఆపదవి నుంచి దింపే స్థోమత ప్రజలకులేదు. అందుకే ఒకసారి గెలిస్తేచాలు ఆ నాయకుడు అయిదేళ్లవరకు నన్ను ఎవరూ ఏమి చెయ్యలేరని విర్రవీగుతారు. అథవా ఉన్నత న్యాయస్థానాలు శిక్షలు వేసినా ఆ శిక్షలను తప్పించుకోవడానికి వాయిదాలు వేయించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ శిక్షనుంచి తప్పించుకోలేక జైలుకు వెళ్లినా ఆరు నెలల్లోగా బెయిల్ మీదో లేక మరోరకంగానో బయటకు వస్తున్నాడు. బయటకు రాగానే మళ్ళీ నాయకుడుగా చలామణి అవుతూనే ఉన్నాడు. తానూ జైలుకు వెళ్లి తప్పులో చిక్కుకొన్నానన్న భావన వారిలో ఏ కోశానా ఉండదు. ఒక సగటు మనిషి కనీసం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కినా ఎంతో క్షోభకు గురవుతాడు. అలాంటిది మన రాజకీయనాయకులు ఎన్ని తప్పులు నేరాలు చేసినా ఎన్నిసార్లు జైలు ఉచలు లెక్కబెట్టినా ఏమాత్రం ఆత్మాన్యూనతాభావం ఉండదు. ఇదీ మనదేశంలో రాజకీయనాయకుల తీరు.
1947 కి ముందు ప్రజలు నాయకులు దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషువాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలుచేసి జైలుకు వెళ్లాలని ఉవ్వీళ్లూఉరేవారు. ఎవరైనా జైలుకు వెళ్లివస్తే వారిని ప్రజలు ఒక గొప్పవ్యక్తిగా భావించేవారు. కానీ ప్రస్తుతం రాజకీయనాయకులు తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లివస్తే పెద్ద పెద్ద ఉఊరేగింపులతో ఇంటికి వెళుతున్నారు. దేశాన్ని దోచుకొని నిస్సిగ్గుగా గొప్ప రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు.