ఒక ఎంపీ నో ఎమ్మెల్యేనో ఒకమంత్రో లేక మరొకరో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక ప్రమాణం చేస్తారు. ప్రతి పనినీ నిస్వార్థంగా చేస్తానని నిజాయితీగా ఉంటానని ఎలాంటి పక్షపాతం గాని రాగద్వేషాలు చూపకుండా పనిచేస్తానని తాము నమ్మిన దేవుడిమీదనేలేదా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తుంటారు. ఆ తర్వాత అయిదేళ్లకాలం చేసిన ప్రమాణాలు ఉల్లంఘించి అన్ని వ్యతిరేక పనులే చేస్తుంటారు.
నేను ఇష్టపడిన నాయకుడు గెలిచాడు ఇక నాకు ఇబ్బందులు తొలగిపోతాయిలే అని బడుగు జీవి ఆశపడతారు. అతడిఆశ ఐదేళ్లకోసారి పునరావృతం అవుతుంది తప్ప ఆ ఆశ నెరవేరదు. ఆ బడుగు జీవి చనిపోయేదాకా ఇదే జరుగుతూ ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ప్రతిఒక్కరు ఏమనుకొన్నారు? పీడ వదిలింది.బ్రిటిష్ వాళ్ళ పాలన అంతమైంది. మనదేశాన్ని మనమే పాలించుకొంటాం ఇక మనం వృద్ధిలోకి రావచ్చు అని కానీ దశాబ్దాలు గడిచిపోయినా పీడమాత్రం వదలలేదు. ఒక పీడతొలగి మరోపీడ పట్టుకొంది.అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందమన్నమాట. ఇలా ఎన్నాళ్ళు జరుగుతుంది? ఇది మారదా? అని విసిగిపోయిన సగటుమనిషి నేడు మార్పు కోరుకొంటున్నాడు. ఎంతో కసిగా ఎన్నికల్లో పాల్గొన్నాడు. ఎన్నో ప్రలోభాలకు గురిఅయ్యాడు. అయినా తన దృష్టి తిప్పుకోలేదు. నేరుగా తాను అనుకొన్న వాడికి ఓటేశాడు.అతన్ని గెలిపించాడు. ఆ గెలిచిన వ్యక్తి కూడా ఒకప్పుడు బడుగుజీవే. ' నాకు బీదరికం అంటే ఏమిటో తెలుసు. ఆకలినప్పుడు తినడానికి అన్నం లేనప్పుడు కడుపునిండా నీళ్లు తాగి హమ్మయ్యా కడుపునిండింది' అనుకోనిగుండె నిబ్బరంతో ముదుకుసాగిన కుటుంబంనుంచి వచ్చి తన స్వయం శక్తితో తెలివి తేటలతో పైకి ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి ఆరాష్ట్రాన్ని దేశ మొత్తంలోనే గాకుండా విదేశాలలో సైతం గుర్తింపు లభించేవిధంగాచేసి రాష్ట్రం నుంచి దేశస్థాయికి ఎదిగి ఢిల్లీ పీఠం అధిరోహించిన భారత ప్రధాని నరేంద్రమోడీ. నరేంద్రమోడీ అందరు అనుకునేంత సులువుగా ప్రధానమంత్రి కాలేదు. ఎన్నోఏళ్లుగా పథకరచన చేశారు. నాదేశాన్ని నేను కాపాడుకోవాలి.అందుకు ముందుగా ఆత్మవిశ్వాసం కావాలి. ఆతర్వాత పథకం ప్రకారం ఒక మార్గాన్ని నిర్మాణం చేశారు. ఆ మార్గంలో ప్రయాణించాడు.ఎన్నో అడ్డంకులను అధిగమించాడు. అనుకొన్నది సాధించారు నరేంద్రమోడీ.
భారత ప్రధానిగా నేడు ప్రజలముందు నిలబడ్డాడు. సరే! కష్టపడ్డాడు. ఫలితం లభించింది ప్రధానమంత్రి అయ్యారు బాగుంది. ఇక అక్కడ- ఇన్నాళ్లు ఈ పదవిని అధిరోహించాలని అహోరాత్రులు కష్టపడ్డాను. ఇక సేదతీరాలని అనుకుంటే- వీరుడు గెలిచినా తర్వాత తన అసలు పనిని ఆరంభిస్తాడు. నరేంద్రమోదీ కూడా అంతే. ఇప్పుడు ఆయన తన అసలు పథకాలను క్రియా రూపంలో పెడుతున్నాడు. నాదేశం అని గర్వపడే వాళ్లలో మొదటి వ్యక్తి నరేంద్రమోడీ. అలా భావించిన వాడే దేశానికి ఏమైనా చేయగలడు. 1947 నుంచి ఇలా ప్రతి ఒక్కరు అనుకోని ఉంటె ప్రతి నాయకుడు కూడా దేశం కోసం పనిచేసేవాడు. ప్రతిఒక్కరు హమ్మయ్యా! పదవి దక్కింది! ఇక నేను ఎలా అభివృద్ధి చెందాలి? అని ఆలోచించడం వల్లనే దేశం తిరోగమన దిశలో సాగుతోంది.