గత పదేళ్ల కాలంలో ఈ దుర్వినియోగం ఎన్ని వందలకోట్లకు చేరుకొందో గణాంకాలను చూస్తే తెలుస్తుంది. ఇలాంటివి జరగకుండా చూడవలసిన ప్రభుత్వాలు తామే అవినీతిదారుల్లో పయనిస్తుంటే ఇక ఈ దేశాన్ని కాపాడేది ఎవరు? అందుకని ముందుగా ప్రక్షాళన అనేది ఇటు రాజకీయనాయకులనుంచి అటు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రారంభించాలి. ఇది ఎంత తొందరగా జరిగితే అంత లాభం మనం పొందినట్లే. రాత్రి పగలు తేడా లేకుండా ఈపని ఆపని అనే తేడా లేకుండా ఈ దేశంలో అవినీతి అనే కర్మాగారం ఇరవై నాలుగు గంటలూ నడుస్తూనే ఉంటుంది. నరేంద్రమోడీ ప్రభుత్వం ముందుగా దృష్తి సారించాల్సింది ఈ రెండు అంశాల మీదనే. ఈ రెండు వ్యవస్థలు ప్రక్షాళన జరిగితే తొంబై శాతం అవినీతి నిర్మూలింపబడినట్లే అని భావించాలి. అలాగే అధికారులు రాజకీయనాయకులు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాటిని వెంటనే తొలగించాలి. విచారణకు ఏళ్లకు ఏళ్ళు కాలయాపన చేయకూడదు. ఆరు నెలల లోపు విచారణ పూర్తి చేసి శిక్ష పడేవిధంగా యంత్రాన్గాన్ని రూపొందించాలి. అవినీతిని ప్రోత్సహించే మంత్రులు ముఖ్యమంత్రులు ఐఏఎస్ లు అందరినీ ఒకే విధమైన విచారణ గాట కట్టేయాలి. అధికారులకు ముఖ్యమంత్రులకు మంత్రులకు సైతం ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదు. వారుకూడా మనలాంటి మనుషులే తప్ప దైవపుత్రులు కాదు. కాబట్టీ మినహాయింపు అనే పదాన్ని పూర్తిగా తొలగించి వేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఈ పద్దతిని ఎంత తొందరగా అమలులోకి తెస్తే అంత మంచిది. కాలం గడచిపోతూఉంది. వెనక్కి వెళితే తిరిగి మళ్ళీరాదు. ఇప్పటికే ఆరు దశాబ్దాలు ధాటి ఎడవ దశాబ్దంలోకి వెళుతున్నాం. స్వాతంత్య్రం వచ్చినా ఫలితం లేదు. దేశమంతా అవినీతికంపు లేచింది. ఓ రకంగా చూస్తే బ్రిటిష్ వారి పాలన మన పాలన కన్నా మంచిదేమో అని అనిపిస్తుంది ఈ రాజకీయనాయకులను అవినీతి అధికారులను చూస్తుంటే. ఈ నాటికి దేశంలో బ్రిటిష్ కాలం నాటి వంతెనలను రైల్వే మార్గాలని వాడుతున్నాం. కొత్తమార్గాలు వంతెనలు ఆనకట్టలు నిర్మిచడానికి నానా తంటాలు పడుతున్నాము. అప్పటికీ ఇప్పటికే సాంకేతికత పెరిగింది. ఏమి లాభం? సామాన్యుడి బ్రతుకు ఇంకా దుర్భరంగా మారిందే తప్పా మెరుగుపడలేదు. ఇప్పటికీ ఇంకాకొన్ని గ్రామీణ ప్రాంతాలకు రహదారుల సౌకర్యాలు లెవీ. రవాణా వ్యవస్థలెదు. విద్యుత్తు సౌకర్యంలేదు. ఏమి అభివృద్ధి చెందాము? కేవలం ఒక్క అవినీతిలో అభివృద్ధి చెందాము! నల్లడబ్బును దాచుకోవడంలో అభివృద్ధి చెందాం.మొత్తం ప్రపంచంలో అవినీతి దేశాలలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. భారత దేశం అంటే ఎలాంటి దేశంలో ప్రపంచానికి అర్థమై పోయింది. ఇలాంటి పరిస్తతుల్లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ఈ దేశాన్ని ప్రక్షాలన చేస్తాడు దేశ రూపురేఖలు మారుస్తాడు అని అందరూ భావిస్తున్నారు.(సశేషం)