నిజాయితీగా ఉన్న అధికారిని ఈ రాజకీయనాయకులు వారి అనుచరులు ఎలాంటి ఇబ్బందులు పెడతారో మనం ప్రత్యక్షంగా చూస్తూనేఉన్నాం. అందువల్ల ముందుగా రాజకీయనాయకుల ఆలోచనా ధోరణి మారాలి.మేము కేవలం డబ్బుసంపాదనకే రాజకీయంలో ఉన్నాము మా అనుచరులు కబ్జాలు చేస్తారు. అధికారులను బెదిరిస్తారు టెండర్లు వేస్తారు దందాలు చేస్తారు గోల్మాల్ చేస్తారు కమీషన్లు దండుకొంటారు. వారు బతికేది వాటిమీదనేకదా? అనే ధోరణి పూర్తిగా మారిపోవాలి. ఎలాగూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతభత్యాలు ప్రభుత్వం ఇస్తూనే ఉంది. మరి కక్కుర్తిపడి దొంగదారుల్లో డబ్బు సంపాదన ఎందుకు చేయాలి. అనుచరగణాన్ని ఎందుకు పెంచి పోషించాలి. చూస్తుంటే ఎంతో విచిత్రముగా ఉంది. ఒక బీదవాన్ని ఒక రాజకీయనాయకుణ్ణి ఒకే దగ్గర కూర్చోబెట్టి భోజనం పెడితే ఇద్దరు ఎంత తింటారు. వారివారి కడుపును బట్టి తింటారు. భోజనం ఒక్కటే కానీ ఇద్దరి మధ్య ఆంతర్యాలు ఎందుకు? నేను ఎమ్మెల్యేను కాబట్టీ ఈ స్థాయిలో ఉండాలి నేను ఎమ్మెల్యేను కాబట్టీ నాకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. నేను ఎమ్మెల్యేను కాబట్టీ నాచుట్టూ పదిమంది ఉంటారు. వారి ఖర్చులన్నీ నేనే భరించాలి కాన ఎక్కువ సంపాదించాలి. సంపాదించాలి కాబట్టీ అడ్డదారులు తొక్కాలి. ఇలా ప్రతిఒక్కరు ఆలోచిన్చుకొంటూపోతే రాజకీయనాయకులంతా అడ్డదారుల్లో డబ్బుసంపాదించాలి. విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మిగిలింది పోగేస్తు విదేశీ బ్యాంకుల్లో దాచుకొంటూ పోయి ఈ రోజు వేలకోట్ల రూపాయలను విదేశాలలో దాచుకొని ఇప్పుడు కిమ్మనకుండా ఉన్నారు. ఆడబ్బన్తా తిరిగి భారతదేశానికి తీసుకు వస్తే దేశంలో ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించవచ్చు. విద్యుత్తు సమస్యను శాశ్వతంగా తీరు హడానికి థర్మల్ పవర్ స్టేషన్లను నిర్మించవచ్చు.
ఇలా దేశంలోనే ఉంటూ దేశాన్నే దోచుకొన్న నాయకులను ఏమనాలి? ఎవరు శిక్షించాలి? ప్రభుత్వం ఒకవైపు పథకాలద్వారా డబ్బు ఖర్చు పెడుతున్నా మరోవైపు ఎంపీలకు ఎమ్మెల్యేలకు నిధులిచ్చి మీరు ఖర్చు పెట్టండి అంటూ ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఎంపీ లాడ్స్ ఎమ్మెల్యే లాడ్స్ అంటూ. ఆపథకాల అసలు ఉదేశ్యం ఏమిటోగానీ లోగుట్టు మాత్రం వాళ్ళు అట్టి డబ్భులను తన సొంతానికి తమ అనుచర గణానికి ఉపయోగించుకోవడమే ఎక్కువగా మారిపోయింది. ఎంపీ కాబట్టీ ఎమ్మెల్యే కాబట్టీ వారి పైన విచారణ ఉండదు. ప్రభుత్వానికి వీరి మద్దతు ఉండాలికాబట్టీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పనితీరును పట్టించుకోదు. ఇలా సంవత్సరాల తరబడి ఈ లాడ్స్ కార్యక్రమం అక్రమ మార్గంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇది ముందు ముందు ఇంకెంత కాలం కొనసాగుతూ ఉంటుందో ఆ పైవాడికే తెలియాలి.(సశేషం)