మీ శ్రేయోభిలాషి.. Part 13


ప్రధానమంత్రిగా ఆయన ప్రతిఒక్కరినీ ప్రతిఒక్క గ్రామాన్నీ వ్యక్తిగతంగా చూడటానికి ఏమాత్రం కుదరదు. కానీ తన పథకాలను ప్రజలచెరువలోకి తీసుకెళ్లడానికి ఉన్న యంత్రాన్గాన్ని ప్రక్షాళన చేయాలి. అధికారులు నిజాయితీగా పనిచేసేవిధంగా వారిని ప్రొత్సహించాలి. అవినీతినిరూపుమాపాలి. అందరూ మనుషులే. అయితే అధికారిగాఉన్న మనిషి సామాన్యుడయిన మనిషిమీద తన అధికారాన్ని ప్రదర్శిస్తుంటారు. అధికారులందరూ ప్రజలకోసమే పనిచేస్తుంటారు. కానీ ఆ ప్రజలు కార్యాలయానికి వస్తే కనీసం అయిదు నిమిషాలు కూడా కలవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరు. ఒక జిల్లాకలెక్టర్ను తీసుకోండి. అతడు రోజంతా తీరికలేకుండా ఉంటాడు. అయినా వాస్తవానికి ఓ అయిదు నిమిషాల సమయం కేటాయించలేడా?
కేటాయించగలడు. కానీ తాను జిల్లాకు సర్వాధికారిని. రారాజును. సామాన్యులతో నేను ఎలా కలుస్తాను కలిస్తే నా పరువేంకావాలి.నేను జిల్లాకు అధికారిని నేనెప్పుడూ బీజీగా ఉండాలి. కేవలం పై స్థాయి అధికారులతో వ్యక్తులతోనే కలవాలి.క్రింది స్థాయి వారితో కలిస్తే నాపదవికి గౌరవం పోతుందనే రీతిలో కొందరు కలెక్టర్లు భావిస్తున్నారు. సరే కలెక్టర్ కాబట్టీ బిజీగానే ఉంటారు. రోజులో కనీసం ఒక గంటసేపైనా సాధారణ ప్రజలతో కలవడానికి సమయం కేటాయించవచ్చు. కానీ అధికార దర్పంతో అహంకారంతో తాను గొప్పవాడిని అని ఊహించుకొంటారు. ఇలా ప్రతి అధికారి తన స్థాయిలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే ఒక సామాన్యుల సమస్యలు ఎలా తీరుతాయి. అందుకే అధికారుల్లో రాజకీయనాయకుల్లో ఈ అధికార దర్పం అహంకారం పూర్తిగా తొలగిపోవాలి.నేను సామాన్యుల కోసం పనిచేస్తున్న ఒక అధికారిని మాత్రమేనని ఆ సామాన్యులకు నేను గౌరవం ఇవ్వాలి వారితో కలవాలి వారి సమస్యలు తెలుసుకోవాలి.ఇలా ఆలోచించి పనిచేస్తే ఆ అధికారి యొక్క అధికారవిలువ ఏమైనా తగ్గుతుందా? అతడి పదవిని ఎవరైనా లాగేసుకొంటారా? అలాంటిదేమీ జరగదు కదా?
 దేశవ్యాప్తంగా ఈ ధోరణి అరాష్ట్రాలలోఉంది. కాబట్టీ ముందుగా అధికారుల మనస్తత్వం మారేందుకు కృషిచేయాలి. అధికారులు నిజాయితీపరులైతే వ్యవస్థ దానంతట అదే ఆదర్శవంతమవుతుంది. ప్రభుత్వఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు అన్నిస్థాయిల్లోనూ ఇలా నిజాయితీగా మారాలి. ఇందుకు ఉద్యోగులకు ప్రత్యేకమైన శిక్షణా తరగతులను నిర్వహించాలి. ఉద్యోగుల్లో మానవత్వం దేశభక్తి అనేవి పెరగాలి. అలాగే వీరితోపాటు సమాజంలో అవినీతికి పాలబడుతున్న రాజకీయనాయకులు వారిపంచాన చేరిన రౌడీషీటర్లు వారి అనుచరులు సంఘ వ్యతిరేక పోకడలు మానాలి (సశేషం)