మీ శ్రేయోభిలాషి.. part -12


హక్కులు అధికారాల గురించి ధైర్యము చేసి ఎవరైనా అడిగితే అణచి వేస్తారు. దేశంలో ఎన్నో ప్రాంతాలలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ పరిస్తతుల్లో దేశానికి ఒక నేత వచ్చారు. అతడైతే సామాన్యుల కస్టాలు తీరుతాయని చాలామంది అనుకొంటున్నారు. సమాజంలో అట్టడుగుస్థాయి నుంచి వచ్చాడు కాబట్టీ అతడికి సామాన్యుడి కస్టాలు బాగా తెలుసు. ప్రజల కస్టాలు తెలిసినవాడు కస్టాలు తీర్చకపోతాడా?అనే ఆశతో దేశప్రజలు ఎదురుచూస్తున్నారు. ఓటర్లు నిజంగా ఒక గొప్ప సాహసమేచేశారు. ఒక సాదా సీదా వ్యక్త్తిని భారతదేశ ప్రధానిగా ఎన్నుకొన్నారు. ఆ సామాన్యుడు ఈ కోట్లాది సామాన్యుల కష్టాలను తప్పక తీర్చాలి. మనం బాధల్లో ఉంటె ఆ బాధలను తీర్చేవాడిని దేవుడు అని అంటుంటాం.ఈ సామాన్యుడు కూడా సామాన్యులపాలిట దేవుడే! దేశంలోని ఎంతోమంది పేదరికంలో మగ్గిపోతున్న సగటు భారతీయుడి దురావస్థను దూరం చేయడానికి ప్రణాళికలు తయారుచేయాలి. వాటిని ప్రతిఒక్కరికీ అందేవిధంగా దారులు ఏర్పరచాలి. సామాన్యుడికి ప్రణాళికల ఫలాలు వేగంగా అందేందుకు సరైన అధికారులను సిబ్బందిని ఏర్పాటుచేయాలి. ఎక్కడా అవినీతికి తావులేని సమర్థులైన అధికారుల పర్యవేక్షణలో పథకాలను అమలు చేయాలి. ఈ పథకాల ఫలితాలు సామాన్యుడి దక్కితే అదే నిజమైన పథకం. అలాంటి పథకాలను అమలు చేయాలి. అయినా సామాన్యుడు ఏమికోరుకొంటాడు? రాజకీయనాయకుల్లాగా తానూ కోటీశ్వరుడిని కావాలని కోరుకొంటాడా? అవినీతి అక్రమ మార్గాలలో డబ్భు సంపాదించాలని కోరుకొంటాడా? లేదు.. లేదు..

ఒకకూలీ తనకు రోజూ కూలీ దొరికితే చాలని కోరుకొంటారు. ఒకరైతు తనకు కనీసం తొమ్మిది గంటలు విద్యుత్తు ఉంటె చాలని కోరుకొంటారు. ఒక ఉద్యోగి తనకు ఉద్యోగ భద్రత ఉంటె చాలని కోరుకొంటారు. ఒక కూలీ చేసుకొనే వాడికి అకస్మాత్తుగా పదివేలు చేతిలో పెడితే ఉబ్బితబ్బిబ్బవుతాడ?లేదు ఆ డబ్భులు చూసి అతని చేతులు వణికిపోతాయి. అదేమరి నిజాయితీఅంటే! ఈ వాస్తవాలను ఇప్పుడు దేశానికి పరిపాలిస్తున్న నరేంద్రమోడీ గ్రహించాలి. సామాన్యుడికి తాను ఏమి చేయగలడో ఆలోచించాలి. అతడికి కనీసం రెండుపూటలా కడుపునిండా తిండి దొరికే దారిని ఏర్పరచాలి. నరేంద్రమోడీజీ ప్రధానిగా ఎన్నోశాఖలను చూసుకోవలసిన అవసరముంది. రోజులో 24 గంటలు వాస్తవానికి సరిపోవు. కొన్నిపనులను వాయిదా వేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. అయినాకూడా ఆయన ప్రతినెలలో రెండు మూడు రోజులైనా సామాన్యుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించాలి. వారి బాగోగులు తెలుసుకోవాలి. (సశేషం)