Part- 10 తరువాయి
వారిని మన ఆలోచన విధానం వైపు ఆకర్షింపచేసుకోవాలి. నేను నమ్మాను కాబట్టీ మీరుకూడా నమ్మండి అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యదేశం.దేశంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే ఆలోచనతో ఉండరు. కావునసంస్కరణలు. తేవాలనుకొంటే ముందుగా అట్టడుగు స్థాయిలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
దేశంలో సహజంగా జరిగే విషయం ఒకటుంది.మన పాలకులు ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకొనే ఆలోచన లేక వేరేదారుల్లో లబ్ది పొందాలని చూస్తుంటారు. డబ్భు సంపాదించాలని చూస్తుంటారు. ఇక్కడ ఒక ఉదాహరణ మీ ధృష్టికి తీసుకువస్తాను. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉంది. అది దేశంలో డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ప్రయాణీకులపై చార్జీలు పెంచుకొంటూ పోతుంది చార్జీలు ఎందుకు పెంచాలి. ప్రతి రోజు ఆదాయం కోట్లల్లో వస్తుంది. దానిని సక్రమంగా వినియోగిస్తే చాలు. కానీ అలా జరుగదు. ఆసంస్థలో పనిఉన్నా లేకపోయినా రాజకీయనాయకులు ఒక పునరావాస కేంద్రంగా దానిని ఉపయోగించుకొంటారు. జీత భత్యాల పేరిటా సౌకర్యాల పేరిటా లక్షలాది రూపాయలు స్వంతానికి ఉపయోగించుకొంటారు.
సంస్థలో పరికరాలు పనిముట్ల కొనుగోళ్లలో కమీషనులు దండుకొంటారు. పలుకుబడిఉన్న ఉద్యోగి పనిచేయకుండానే వేలాది రూపాయలు వేతనం తీసుకొంటారు. ఎక్కడచూసినా అవినీతి తడవిస్తుంది. అనవసరమైన వాటికి కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుంటారు. తీరా డీజిలు ధర పెరిగేసరికి నష్టాలు వస్తున్నాయని ప్రజలమీద టికెట్లభారం వేసి తాముమాత్రం విలాసాల ఊబిలో మునిగిపోతుంటారు.
అవినీతి ఎక్కడ ఏ రూపంలో జరుగుతుందో అధికార యంత్రాన్గానికి తెలుసు. కానీ వారు కిమ్మనకుండా ఉంటారు. ఎందుకంటే ఆ అవినీతిలో కొంత పర్సెంటేజ్ పాపాన్ని వారుకూడా తింటూ దేవుడి విగ్రహంలా అంతా చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటారు. ఏ పార్టీ అయినా సరే రాజకీయనాయకుల పోకడ ఒక్కటే. తాను బాగుండాలి సామాన్యుడు కష్టపడాలి.
ఈ దేశంలో స్వాతంత్య్రం తర్వాత దశాబ్దాలుగా సామాన్యుడి ఇక్కట్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో ఉన్నాయి. ఈ పరిస్థితి మారదా? మారకూడదా? మారాలని మార్చాలని ఏ పాలకుడికి తెలియదా? ఇంత ఘోరమా? చూస్తుంటే ఏది పట్టపగలే దోపిడీ చేసినట్లుగా ఉంది. కోట్ల రూపాయలను పరుపులుగా మార్చుకొని పాడుకొనే నాయకులు ఈ సామాన్యుల వ్యథలనూ చూడటం లేదా? ఎన్నికలొచ్చినప్పుడు ఆ సామాన్యులే కదా ఓట్లు వేసి గెలిపించేది? అందలం ఎక్కించడానికి సామాన్యుడు కావాలి అనుభవించడానికి మాత్రం నేతలు! ప్రపంచంలో అన్ని దేశాలలో ఇలాగే ఉందా? సామాన్యుడికి హక్కులు అధికారాలు అక్కరలేదా? (సశేషం )