అన్ని రూట్లలో బస్సులు నడపాలని


ఈనెల 13 నుండి జిల్లాలోని అన్ని రూట్లలో బస్సులు నడపాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వనపర్తి డిఎం దేవదానం ను ఆదేశించారు
శనివారం వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతమోహంతి తో పాటు జిల్లా ఎస్పీ అపూర్వ రావు, ఇతర అధికారులు వనపర్తి బస్ డిపో ను సందర్శించి, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా బస్సుల నిర్వహణ, బస్సు కండక్టర్ లు, డ్రైవర్లు, బస్సుల అందుబాటు,రూట్ల నిర్వహణ పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 38 రూట్లకు గాను ప్రస్తుతం 23 రూట్ల లో బస్సులు నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రాంత రూట్ల పై కొత్తగా వచ్చే డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన లేనందున ఆ రూట్లలో బస్సులను నడపలేక పోతున్నట్లు డి ఎం కలెక్టర్కు వివరించారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ 15 రూట్ లకు 15 మంది విఆర్వోలు, కానిస్టేబుళ్లను ఇస్తామని, వారి సహకారంతో ఆ రూట్లలో కూడా బస్సులు నడపాలని ఆదేశించారు.