- 8మందిపై కేసు నమోదు
- 5గురు అరెస్టు...రిమాండ్ కు తరలింపు
- విలేకరుల సమావేశంలో జిల్లా ఇంచార్జీ ఎస్పీ అపూర్వరావు
గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం 7గంటలకు జిల్లా ఇంచార్జీ ఎస్పీ ఆపూర్వరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.....
ఆగస్టు 5న గద్వాల పట్టణం నందు గల మేళ్ళాచెర్వు x రోడ్డు నందు గద్వాల టౌన్ SI M. సత్యనారాయణ ఆద్వర్యంలో వాహనాల తనిఖి నిర్వహిస్తుండగా మేళ్ళాచెర్వు వైపు నుండి నడుచుకుంటూ వస్తున్న పులిగ నాగరాజు @ నాగన్న నివాసం ఎల్కూర్, మల్దకల్ మండలం పోలీసులను చూసి పారిపోతుంటే అతనిని వెంబడించి పట్టుకొని విచారించి అతని దగ్గర ఉన్న బ్యాగును తనిఖి చేస్తే అందులో నిషేదిత CPI (మావోయిస్టు) పార్టికి సంబందిచిన, ప్రభుత్వవ్యతిరేక విప్లవ సాహిత్యం లబించాయన్నారు.
ఇంకా అతనిని విచారిస్తే, అతను తెలంగాణ విద్యార్థి వేదిక అనే నిషేధిత CPI మావోయిస్టు పార్టీకి సంబంధిoచిన ప్రభుత్వ వ్యతిరేక అనుబంద సంస్థ లో పనిచేస్తూ, తెలంగాణా విద్యార్తి వేదిక అనే నిషేదిత CPI మావోయిస్టు పార్టీ యొక్క అనుబంద సంస్థ లో పనిచేస్తున్నట్లు, విద్యార్థులను మోటివేట్ చేసి, మావోయిస్టు సానుభుతిపరులుగా పని చేస్తున్నారనిమావోయిస్టు డైరెక్షన్ మీద పని చేసి నిధుల సమకూర్చేవారేవారని, అదే విధంగా మావోయిస్టులకు సానుభూతి పరులుగా పనిచేసేవారని ఎస్పీ వెల్లడించారు.
నాగన్న పూర్తిస్థాయిలో విచారించి బండారు మద్దిలేటి, వైనమోని బలరాం, కాంతి జగన్, చుక్కల శిల్ఫా, గుంత రేణుకా, మెంచు రమేశ్ – నల్లమాస కృష్ణలపై అక్టోబర్ 5న 8మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
మరో ఇద్దరు అరెస్టు:
ఇదే కేసులో నిందితులుగా ఉన్న టీవీవీ అధ్యక్షుడు బండారు మద్దిలేటి-A2, టీపీఏఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాసి కృష్ణ-A8 లు మావోయిస్టుపార్టీ కోసం చురుకుగా పని చేయడం తో పాటు మావోయిస్టులకు నియామకాలు, పార్టీ కోసం నిధుల సేకరణ చేస్తూ పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టులు నిర్వహించిన వివిధ కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నందున వీరిద్దరిని OCtober 15న హైద్రాబాద్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి పార్టీ విప్లవ సాహిత్యం, సర్క్యులర్లు మరియు ఇతర విధ్వేష పూరిత సాహిత్యం ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి నుంచి పెన్ డ్రైవ్స్, మెమోరికార్డు, ఇతర పత్రాలు స్వాదీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.
వీరు ప్రభుత్వ నిషేదిత సంస్థలు ఏర్పాటు చేసుకొని వాటి రహస్య మీటింగులు నిర్వహిస్తూ విద్యార్థులను నిషేదిత కార్యక్రమాల వైపు ప్రేరేపిస్తున్నారని.... మిగిలినవారిని కూడా పట్టుకొని కోర్టులో హాజరుపరచడము జరుగుతుంని ఆమె తెలిపారు.
ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి నుండి యువత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువత తప్పుడు దారులను ఎంచుకోకుండా చదువు మీద దృష్టి ఉంచి భవిష్యత్ లో ఉన్నత స్థాయి లక్ష్యాలనూ చేరుకోవాలని, అలాగే యువతను ఆకర్శించి మావోయిస్టు పార్టీలోకి పంపాలనే ప్రయత్నాలు సాగిస్తున్నా ఇలాంటి వార సమాచారంను అందుబాటులో ఉన్న పోలీసు అధికారులకు తెలియజేయాలని ఎస్పీ కోరారు.