సోమవారం రాత్రి నాగర్ కర్నూల్ నుండి షాద్ నగర్ కు తరలించిన సాంఘిక సంక్షేమ ఎస్సీ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినిలను కలసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు అనంతరం అక్కడ ఉన్న వసతులను,నాగర్ కర్నూల్ లో లేని వసతులు ఏమిటనే వివరాలు విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు.
వివరాలను మొత్తం పరిశీలించి విద్యార్థినిల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి వివేదించి కళాశాలను నాగర్ కర్నూల్ లో కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారు,త్వరలో కళాశాలను నాగర్ కర్నూల్ కి తరలించి అక్కడే అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించనునట్టు తెలిపారు...