వనపర్తిలో టిఆర్ఎస్ సమావేశం


తెలంగాణ రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి  నివాసంలో వనపర్తి పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో పట్టణ టిఆర్ఎస్ కమిటీ  సమావేశం ఏర్పాటు అయింది! ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త రంగినేని అభిలాష్ రావు, బి లక్ష్మయ్య  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంగినేని అభిలాష్ రావు మాట్లాడుతూ వనపర్తి పట్టణంలోని 26  వార్డులలో మరియు నాగవరం రాజనగరం మర్రికుంట శ్రీనివాసపురం, నరసింగాయపల్లిలో  పురపాలక అన్ని వార్డులలో 11 రోజుల పాటు మహిళ  సంఘాలు ప్రజల భాగస్వామ్యంతో టిఆర్ఎస్ నాయకులు శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలని టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు సూచించారు. వార్డులలో మురుగుకాలువ శుభ్రం చేయటం పిచ్చి మొక్కలు తొలగించడం రహదారులు గుంతలు పూర్చడం కాలి స్థలాలలో  పిచ్చి మొక్కలు తొలగించాలని ప్లాస్టిక్ నిషేధంలో పట్టణ ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అభిలాష్ కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ కౌన్సిలర్ లో లక్ష్మీనారాయణ, నందిమల్ల శ్యాం కుమార్, ఉంగలం తిరుమల్ నాయుడు, పాకనాటి కృష్ణ   యాదవ్, ఆవుల రమేష్, రమేష్ నాయక్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.