ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రైవేట్,ప్రభుత్వ పాఠశాలల దసరా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల విద్యాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్)-TPUS జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ గౌడ్,అమరెందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు. అక్టోబర్ 21 నుండి విద్యార్థులకు ఎస్.ఏ-1 పరీక్షలు నిర్వహించవలసి ఉన్నదని, ఈ దసరా సెలవులు పొడిగింపు వల్ల పరీక్ష నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు తెలిపారు. దసరా సెలవులు పొడిగించి,ఆ పని దినాలను భర్తీ చేయడానికి ఈ సంవత్సరంలో వచ్చే రెండవ శనివారం సెలవులన్నీ కూడా రద్దు చేయడం తగదన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఇబ్బందికర వాతావరణాన్ని నివారించే టట్లుగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది.