ప్రభుత్వ రంగాలని ప్రైవేటీకరణను చేస్తే వ్యతిరేకిస్తాం.. సిపి ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


 వనపర్తి   రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రజలకు సేవలు అందించే ఏ రంగం అయినా  ప్రవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని అది ఏ స్థాయిలోనైనా  వామపక్ష పార్టీలుతప్పకుండా వ్యతిరేకిస్తూ  పోరాడుతామని  సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోలో సందర్శన లో భాగంగా వనపర్తి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె శిబిరానికి చేరుకొని సంఘీభావాన్ని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు కండలు కరిగించి ఆస్తులను కూడా పెడితే ఈ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రతోనే కార్మికులకు తో చర్చలు  జరపడం లేదని రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు అందుకే ప్రజలంతా ఆర్టీసి సమ్మె కు మద్దతు పలుకుతున్నారని అన్నారు. 


హైకోర్టు మొట్టికాయలు వేసిన బుద్ధి రావడం లేదని ఇప్పటికైనా దిగి రాకుంటే ఈనెల 30న సకలజనుల సమరభేరి లో వారి సంగతి తేలుస్తా మన్నారు కార్మికులు ధైర్యం కోల్పోకుండా పరిష్కారం అయ్యే దాకా పోరాడాలన్నారు తెలంగాణ సమాజమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆర్టీసీ కార్మికుల కు పోరాట చరిత్ర ఉన్నదని వారు లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బాల మల్లేష్, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు విమల,  సిపిఎం జిల్లా కార్య దర్శి ఉండి జబ్బార్,  జిల్లా కార్యదర్శి విజయ రాములు, భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు కి కళావతి మ్మ, రాష్ట్ర కార్యదర్శి సత్యం సాగర్ సిపిఐ నాయకులు డి చంద్రయ్య, శ్రీరామచంద్రుడు మోష రమణ శివకుమార్ జై చంద్రయ్య,  బిజెపి నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.