జీవన నైపుణ్యాలు పెంచుకోవాలి


బాలికలు విద్యతోపాటు జీవన నైపుణ్యాలు పెంపొందించు కోవాలని వనపర్తి జిల్లా పౌరసంబంధాల అధికారి ఈ వెంకటేశ్వర్లు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని తరుణి ఫంక్షన్ హాల్ లో రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్  ఆధ్వర్యంలో యువతులలో నైపుణ్యాల అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంపు అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి డి పి ఆర్ ఓ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలు చదువుతోపాటు సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలని, అంతేకాకుండా అందుబాటులో ఉన్న వనరులతో, అవకాశాలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి అని చెప్పారు. సమస్యలను ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని గ్రామాలలోని బాలికలను చైతన్యం చేయాలని, ఆరోగ్యంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.