అప్పంపల్లి అమరులది వీరోచిత పోరాటం - నల్లు ఇంద్రసేనా రెడ్డి
మరో నిజాం గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు
తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్- శ్రీవర్ధన్ రెడ్డి గారు.
ఈరోజు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ అద్వర్యం లో అప్పంపల్లి అమరవీరులకు గణమైన నివాళులు అర్పించడం జరిగింది.
ఈయొక్క కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు శ్రీమతి డీకే అరుణ రావడం జరిగింది.
ఇంద్ర సేనారెడ్డి మాట్లాడుతూ
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక దేశమంతా భారత్ మాతాకీ జై అంటున్న తెలంగాణలో మాత్రం భరత మాత కి జై కొట్ట లేనటువంటి పరిస్థితి నిజాం పదఘట్టనల కింద రజాకార్ల తుపాకుల బుల్లెట్ల బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రజానీకం. ఉమ్మడి పాలమూరు జిల్లా స్వాతంత్ర ఉద్యమంలో ఎనలేని పోరాటం చేశారు. ఖద్దరు ఉద్యమం, సహాయ నిరాకరణ, ఉద్యమం సత్యాగ్రహం లాంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అమరచింత ప్రాంతంలో ఖద్దరు లక్ష్మారెడ్డి ఈ స్వాతంత్ర సమర యోధుని ఆధ్వర్యంలో 1947 ఆగస్టు 15 న జాతీయ పతాకావిష్కరణకు సిద్ధమయ్యారు కానీ నిజాం రాజు జాతీయ పతాకాన్ని ఎవర ఆవిష్కరించడానికి వీలు లేదని హుకుం జారీ చేశాడు. అయినప్పటికీ లక్ష్మా రెడ్డి గారు ఆధ్వర్యంలో వందలాది మందితో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.
దీనితో ఆగ్రహించిన నిజాం పోలీసులు లక్ష్మారెడ్డి ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. తిరిగి రెండోసారి పతాకావిష్కరణకు ప్రజలు పోరాటం చేశారు. దీనితో గ్రామగ్రామాన స్వాతంత్ర దినోత్సవం జరిపించాలని పట్టుదల అందరిలో పెరిగిందన్నారు .
జితేందర్ రెడ్డి మాట్లాడుతూ
ఆత్మకూరు సంస్థానం లోని చిన్నచింతకుంట, నెల్లికొండి, వడ్డేమాన్, దాసరి పల్లి, రాంపూర్ అప్పంపల్లి లంకల నుండి రెండు వేల మంది నిజాంకు వ్యతిరేకంగా ఆత్మకూరు పట్టణంలో సత్యాగ్రహం చేశారు.
ఈ సత్యాగ్రహం నిర్వహణలో ప్రముఖంగా పాల్గొన్న అప్పంపల్లి స్వాతంత్ర సమర యోధుడు
బెల్లం నాగన్నను అరెస్టు చేయాలని నిజాం పోలీసులు అప్పంపల్లి కి వెళ్లారు. దానితో గ్రామస్తులందరూ నాగన్నకు మద్దతుగా నిజాం పోలీసులతో వాగ్వాదం చేశారు. ఇదంతా ఇక్కడ మన ముందున్న నాగన్న ఇంటి దగ్గర ఉన్న రావి చెట్టు ఇప్పుడు చరిత్రకు ఈ చెట్టు ప్రత్యక్ష సాక్షం. ఈ సంఘటన నాగన్నకు నిజాం పోలీసులకు ఘర్షణ తలెత్తింది దీనిలో గ్రామస్థులు నాగన్నతో కలసి నిజం పోలీసులను అప్పంపల్లి గ్రామస్తులు ఎదురించడంతో ఏమిచేయలేక వెనుదిరిగి వెళ్లిపోయారు .
అప్పంపల్లి గ్రామస్తుల పైన ఆక్రోశం తో ఉన్న నిజాం సైన్యం అదే రోజు రాత్రి గ్రామ ప్రజల పై కాల్పులు జరిపారు. 11 మంది గ్రామస్తులు అక్కడికక్కడే మరణించారు ఆ శవాల అన్నింటిని రావి చెట్టుకు కట్టి వేలాడదీశారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ అప్పంపల్లి నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఈ గ్రామస్థుల వీరోచిత పోరాటం ఎంతో మందికి ఆదర్శమన్నారు.
డీకే అరుణ మాట్లాడుతూ
నిజాం వారసత్వ పార్టీ MIM పార్టీ ని దృష్టిలో ఉంచుకొని ఓట్ల కోసం సీట్ల కోసం తెలంగాణ చరిత్రను చరిత్ర పుటల్లో ఎక్కించేది పోయి చరిత్రను అనగదొక్కుతున్నారని విమర్శించారు
తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే నిజామాబాద్ లో ఎమ్ జరిగిందో తెలుసుకోవాలని అన్నారు.చరిత్ర తెలువకపోతే మా అప్పంపల్లి ప్రజలను వచ్చి తెలుసుకోవాలని అన్నారు.
శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయం లో ఒక మాట అధికారం లోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతూ మరో నిజాం రాజు గా వ్యవహరిస్తున్నారని అన్నారు .ఉద్యమ సమయం లో గత ప్రభుత్వాల పై ఎదురుదాడి చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని గుర్తుచేశారు .
అప్పంపల్లి మరో అమరదామం.
ఇక్కడ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గారితో ఆవిష్కరించి ప్రతి యేటా 17 సెప్టెంబర్ న అమరవీరులకు నివాళ్ళు అర్పించడం జరుగుతుందని అన్నారు
ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు మండల నాయకులు .మరియు కార్యకర్తలు నిజాం చేతిలో అమరులైన కుటుంబాలు పాల్గొనడం జరిగింది.