(ఆయుధం న్యూస్ ) దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో హత్యగావింపబడిన బిజెపి కార్యకర్త ప్రేంకుమార్ తల్లి, సోదరిని ఈ రోజు హైదరాబాద్ లోని దిల్ కుష్ గెస్ట్ హౌస్ నందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు పరామర్శించారు. కిషన్ రెడ్డి గారు ప్రేంకుమార్ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుంది అని, ప్రేంకుమార్ సోదరి చదువుకు సహాకారం చేస్తామని, ఖచ్చితంగా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తాను అని అన్నారు.
కిషన్ రెడ్డి గారిని కలిసిన వారిలో పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగురావు నమాజీ, జిల్లా అధ్యక్షులు పద్మజా రెడ్డి, నాయకులు రతంగాపాండు రెడ్డి, పవన్ కుమార్ రెడ్డీ, పడాకుల బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, వీరబ్రహ్మ చారీ, పడాకుల సత్యం, కృష్ణావర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

