జూనియర్ కళాశాల... సిపిఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

(ఆయుధం న్యూస్ ) ధరూర్ మండల‌ కేంద్రంలోని జూనియర్ కళాశాల.. సిపిఎస్ పాఠశాల లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సందర్శించారు.. మల్దకల్ మండలంలో కార్యక్రమం ముగించుకుని ధరూర్ కు వస్తున్న మార్గ మధ్యలో జూనియర్ కళాశాల.. సిపిఎస్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పాఠశాలలో  మధ్యాహ్నం భోజనం పరిశీలించారు.. అనంతరం ఎమ్మెల్యే అక్కడ భోజనం చేసి రుచి చూసారు... మధ్యాహ్న భోజన సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు... ఎమ్మెల్యే వెంట సర్పంచ్ పద్మమ్మ.. ధరూర్ నరసింహ రెడ్డి..మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి..జాంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి..కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ.. ధరూర్ రవి..జాకీర్..మల్లికార్జున్ రెడ్డి.. అబ్రహం.. తదితరులు ఉన్నారు