◆ గద్వాల నియోజకవర్గ శాసనసభ్యుడు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి
(ఆయుధం న్యూస్ ) దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల నియోజకవర్గ శాసనసభ్యుడు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం మల్దకల్ మండల ,ధరూర్ మండలం లోని కేంద్రంతో పాటు, పట్టణంలోని 22,23 వార్డులలో అంగన్ వాడి కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా గర్భిణీలకు చిన్న పిల్లలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మహిళలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు గర్భంతో ఉన్న మహిళలకు పౌష్టికాహారం అందించి అలాగే చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి పిల్లవానికి 75 గ్రాముల బియ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు అలాగే కేసిఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు జరిగితే రూ. 13000 లతో పాటు 16 రకాల వస్తువులను అందిస్తూ తల్లి బిడ్డ సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు గత పాలకుల కాలంలో పుట్టిన బిడ్డకు పౌష్టికాహారం లోపం వల్ల చాలామంది పిల్లలు పుట్టుకతోనే అంగవైకల్యం లేదా మరణించే వారని తెలిపారు సంక్షేమంలో దేశంలో అగ్రగామిగా ఉంటూ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయం చైర్మన్ బి యస్ కేశవ్ కౌన్సిలర్ బి.యస్ కళావతి , లక్ష్మి మురళి కోటిశ్ గోవిందు మల్దకల్ zptc భాస్కర్ ,mptc వెంకటన్న సర్పంచ్ యాకోబ్ ధరూర్ సర్పంచ్ పద్మమ్మ తెరాస పార్టీ నాయకులు తిమ్మన రెడ్డి ధర్మం రెడ్డి అజయ్ అంజనేయులు సీతారాం రెడ్డి రామచంద్ర రెడ్డి అమరావతి కృష్ణారెడ్డి ధరూర్ నరసింహా రెడ్డి, సత్యం, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, జాకీర్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు