ఆయుధం (న్యూస్)రానున్న పంచాయతి ఎన్నికలలో భాగంగా గద్వాల మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు.. నాయకులతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు...టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు..నాయకుల అభిప్రాయాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు... అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు.. నాయకులు కలిసిమెలిసి పనిచేసి నియోజకవర్గంలోని అని గ్రామ పంచాయతి లలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేద్దామని గద్వాల మండల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు... నాయకులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ MPP సుభాన్ జిల్లా రైతు సమన్వయం సమితి అధ్యక్షుడు చెన్నయ్య తెరాస పార్టీ సీనియర్ నాయకులు పరమాల నాగరాజు పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయుడు మండలం రైతు సమన్వయం సమితి అధ్యక్షుడు ప్రతాప్ గౌడ్ .ఆయా గ్రామాల కార్యకర్తలు.. నాయకులు యూత్ తదితరులు పాల్గొన్నారు