రక్తదానంచేయండి . ప్రాణదాతలుకండి

(ఆయుధం న్యూస్ ) ఐజ ఈ నెల 18 వతేదీన  పేదల పెన్నిధి, తెలుగు భాషను దిశ దశలో వ్యాప్తి చేసిన నందమూరి తారకరామారావు ( సీనియర్*NTR ) వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ జిల్లా అధ్యక్షులు, రామచంద్రారెడ్డి,రెడ్ క్రాస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తాహెర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఈ నెల 18వ తేది ఉదయం 9గంటల నుంచి సాయంకాలం 5గంటల వరకు ఐజ పట్టణంలోని పాత బస్టాండ్ నందు ఏర్పాటు చేయనున్నారు.రక్తదానం చేయడం కొరకు 18 సం "నుండి 50 సం "వరకు ఆరోగ్యంగా ఉన్న వారు ఇవ్వవచ్చని వారన్నారు.అందులో భాగంగా కాలేజి, గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలలో రక్తదానం గూర్చి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. మరియు సమాజంలో ఆసక్తి గల యువకులు ఎవరైనా రక్తదానం చేయుటకు ముందుకు రావచ్చని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు,కంప్యూటర్ శిక్షణా ఉపాధ్యాయులు రవిశేఖర్ మొదలగువారు పాల్గొన్నారు.