(ఆయుధం న్యూస్ ) శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (తెల్లవారితే శనివారం) చెడ్డి గ్యాంగ్ గద్వాల్ లో ప్రవేశించింది. వేణు అపార్ట్మెంట్ లో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రవేశించి చోరీకి యత్నించారు. ఆరుగురు దుండగులు ముఖానికి మాస్కులు ధరించి, చెడ్డీలు వేసుకుని అపార్ట్మెంట్ లోకి ప్రవేశించారు. సీసీ కెమెరాలను తొలగించారు. అపార్ట్మెంట్ లోని అన్ని అంతస్తులకు ప్రవేశించి ఇండ్ల డోర్లను కొట్టారు. ఎవరు కూడా తలుపులు తెరవకపోవడంతో పాటు...తాళాలు వేసిన ఇండ్లు లేకపోవడంతో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. అయితే చెడ్డి గ్యాంగ్ ప్రవేశించడం వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు శివారు ప్రాంత ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.