జూరాల నుండి నీటి విడుదలకు ప్రభుత్వ ఆదేశం

(ఆయుధం న్యూస్ )

- ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి లేఖకు స్పందించిన నీటి పారుదల శాఖ తీర ఇంజనీర్
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు


జూరాల ఎడమ కాలువ కింద నీటి విడుదలను ఆపిన నేపథ్యంలో రైతులు వేసిన వేరుశెనగ పంట ఎండిపోయే పరిస్థితి ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ గారు ఒక తడికి నీటిని వదిలేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా లేఖకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు.