బనక చర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం



             టిపిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్


నిజామాబాద్ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: బనక చర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని టిపిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జిఒలు వెలువడ్డాయన్నారు. బనకచర్ల, బిసి రిజర్వేషన్లు, బిజెపి – బిఆర్ఎస్ ద్వంద్వ వైఖరిపై మహేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. రాయలసీమను రత్నాల సీమను చేస్తానన్నది, బనకచర్ల జిఓలపై ఆంధ్రా హక్కులను కాపాడతానన్నది మాజీ సిఎం కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఎపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో కెసిఆర్ చెట్టాపట్టాలు వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారని, అప్పుడు ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారని దుయ్యబట్టారు. బనక చర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.