నెరవేరిన బీజేపీ కల



బీజేపీ సహ ఆ పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కలగంటున్న అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. సుప్రీం రాజ్యంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో… వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని రాంలల్లాకే చెందుతుని స్పష్టం చేసింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా నలుగుతోన్న రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది.
మోడీ మొదటిసారి ప్రధాన మంత్రి అయినప్పటి నుండే రామమందిర నిర్మాణం ఎప్పుడూ… అంటూ అనేక ప్రశ్నలు వచ్చాయి. బీజేపీలోనూ కొంతమంది నేతలు మోడీ కూడా సైలెంట్ అయిపోయారా, ఎందుకు తేనే తెట్టను కదపటం అని ఊరుకుంటున్నారా అని విమర్శలు వచ్చాయి. అంతకు ముందు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ రథయాత్ర తర్వాత జరిగిన ఆందోళనలు, మారణహోమాలు మరోసారి పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందేమో అని అంతా భయపడ్డారు. అందుకే సుప్రీం కోర్టు కూడా తీర్పు వెలువరించేందుకు కొంత సమయం తీసుకోవటంతో పాటు, తీర్పును వెలువరించడానికి ముందు స్వయంగా సుప్రీం న్యాయమూర్తి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు.

ఇప్పుడు రామజన్మభూమి రాముడిదే అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా… శాంతియుత వాతావరణంలో మాత్రమే భూపంపకం, నిర్మాణాలు చేపట్టాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కండిషన్‌లో అర్థం చాలా లోతుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.