ఈ రోజు జిల్లా కేంద్రంలోని వాసవి డిగ్రీ కళాశాల యందు నరేంద్రమోదీ జన్మదిన వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న సేవా సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఒక సారి వినియోగించే ప్లాస్టిక్ వాడబోమని ప్రతిజ్ఞను కళాశాల విద్యార్థులతో కలిసి బిజెపి నాయకులు ప్రతిజ్ఞ చేశారు.
ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితమై ప్రజలు అందరూ కూడా ప్లాస్టిక్ ను వాడకుండా ఉండాలని, నీరు, వాయువు కాలుష్యం కాకుండా చూడాల్సిన అవసరం
ఇప్పుడు ప్రతిఒక్కరిపైనా ఉందని, కావున అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని విరమించాలని అన్నారు.
అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు ఉద్యమాలు చేసి, నేను ముఖ్యమంత్రి అయ్యాకా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు ఒడ్డు చేరాక తెప్ప తగలేసినట్టు ముఖ్యమంత్రి అయ్యాకా కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని ఆయనే తొంగలో తొక్కారు అని, తెలంగాణ ప్రజలు ఆయనకు బుద్ది చెపుతారని అన్నారు.
ఈ కార్యక్రమములో సేవా సప్తాహ జిల్లా కన్వీనర్ పడాకుల బాలరాజు, సహా ప్రముఖ్ బురుజు రాజేందర్, నాయకులు వీరబ్రహ్మ చారీ, పడాకుల సత్యం, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణావర్ధన్ రెడ్డి, అంజయ్య, పాండురంగ రెడ్డి, రామకృష్ణ, మహేష్, నాగరాజు, సురేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మయూర్ నాథ్, సుదీర్ రెడ్డి, శివ, అఖిల్, సందీప్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

