బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం

*ఈనెల 14 రాష్ట్ర బందును జయప్రదం చేయండి


*బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి  కటుకూరి లక్ష్మి, సీనియర్ నాయకురాలు ఏ.లత


హైదరాబాద్, అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి  కటుకూరి లక్ష్మి, బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకురాలు ఏ.లత లు పేర్కొన్నారు. శనివారం బిసి భవన్ లో జరిగుఇన మీడియా సమావేశం లో సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు లతా సింగ్, కన్వినర్  మంజువాని ,రమ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.నోటిఫికేషన్ విడుదల ఐనాకఎన్నికల ప్రక్రియను రెండు వారాల పాటు ఆపడమనేది దురదృష్టకరమన్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫిషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉ న్నప్పటికి  సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం దారుణమన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగించడమే కాకుండా  బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు.. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు,.. నోటికాడి అన్నం ముద్దను లాక్కున్నారు. దీనికి ప్రభ్నుత్వ విదానమే కారణమన్నారు. బీసీల్లో ఏంతో చైతన్యం వచ్చింది.. ఊరురా స్పందన తెలుపుతాం. దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుంది.