రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లే ముద్దు ---- పార్టీల పరమైన రిజర్వేషన్లు వద్దు- దాసు సురేశ్..


*50 శాతం రేజర్వేషన్ల పరిమితి మించవద్దన్న హై కోర్ట్ మధ్యంతర ఉత్తర్వును ప్రభుత్వం సవాల్ చేయాలి..


*స్టే ను వెకేట్ చేయించడం, సుప్రీం కోర్ట్ లో రివ్యూ పిటిషన్ పై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చొరవ చూపాలి..


*బీసీ రిజర్వేషన్ ల అంశాన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం మానాలి..


*42 శాతం బీసీ రేజర్వేషన్లను అమలు చేయాల్సిన భాద్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలదే..


*బీసీ రాజకీయ బానిసత్వ విముక్తి  కోసమే  ప్రజా ఐక్య కూటమి ప్రయత్నాలు .. కలిసి రావాల్సిందిగా బీసీ సంఘాలు, అన్ని రాజకీయ  పార్టీలకు పిలుపు..


*త్వరలోనే అఖిలపక్ష ఆంతరంగిక సమావేశం, ఐక్య కార్యాచరణ ప్రకటన..


*బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్


హైదరాబాద్ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );:  రాజ్యాంగపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రజా ఐక్య కూటమి కన్వీనర్ బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఈరోజు సచివాలయం మీడియా పాయింట్ వద్ద దాసు సురేష్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల ప్రక్రియకు 50 శాతం రిజర్వేషన్ ల పరిమితికి హైకోర్టు అభ్యంతరం పెట్టిందన్న కారణంతో బీసీలకు పాత పద్దతిలో స్థానిక ఎన్నికలకు వెళితే బీసీ సమాజం చూస్తూ ఊరుకో బోదని  హెచ్చరించారు. 50%  రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చే బాధ్యత ప్రభుత్వాని దేనిని పేర్కొన్నారు. హైకోర్టు స్టేను కారణంగా చూపుతూ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కట్టబెడతామని మభ్యపెట్టే మాటలు వద్దు అన్నారు.  బీసీలను రాజకీయ బానిసత్వం నుంచి విముక్తం చేసే దిశగా ఇకపై మరింత గట్టి అడుగులు వేస్తామని తెలిపారు. ఇది ఐక్య కూటమి పోరాటంతోనే సాధ్యమవుతుందని స్పష్టంగా తెలిపారు.బీసీ రాజకీయ  ఆకాంక్షల కోసం  ప్రజా ఐక్య కూటమి సమర శంఖం పూరించినట్లు చెప్పారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల సహకారాన్ని కూడగట్టేలా ప్రజా ఐక్య కూటమిని ఏర్పాటు చేసినట్లు దాసు సురేష్ చెప్పారు. ఇది కేవలం ఓ సమాఖ్య కాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికీ రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కలిగించేందుకు ఒక ఉద్యమ శక్తిగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. రాష్ట్రం, దేశవ్యాప్తంగా బీసీలను రాజకీయ బానిసత్వం నుండి విముక్తం చేయడం ప్రజా ఐక్య కూటమి ప్రధాన లక్ష్యమని దాసు సురేష్ పేర్కొన్నారు. 42% రిజర్వేషన్ అమలు కోసం నిరంతరం ఉద్యమాలు  నిర్వహిస్తామని చెప్పారు.రాజకీయపరమైన రిజర్వేషన్లు వద్దు – రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ముద్దు" అని దాసు సురేష్ సురేష్  స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ ఉద్యమం కేవలం బీసీల కోసమే కాదు – ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటమని.. ప్రతి వర్గం భాగస్వామ్యం కలిగి, న్యాయ సమాజ నిర్మాణంలో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కమిటీ: వీరేందర్ గౌడ్ ,యువజన వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కిషోర్ ,రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ప్రసన్న,గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు సరస్వతి, వంగ రవి యాదవ్, లక్ష్మణ్, మదన్ యాదవ్, లక్ష్మి, జ్యోతి మాదేవి, భాగ్యలక్ష్మి, వరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.