అమరావతి ఏప్రిల్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );కరోనా వైరస్ ఎప్పుడు
ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.దేశవ్యాప్తంగా
కూడా కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాగా కరోనా దేశంలో
వ్యాప్తి చెందిన మొదట్లో ఏపీలో పెద్దగా కరోనా కేసులు నమోదు కాలేదు కానీ ఇప్పుడు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500 దాటిపోయింది.
అటు దేశంలో ..ఇటు రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీలో ఆ రెండు
జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉండటంతో దేశం మొత్తం ఇప్పుడు ఏపీలోని ఆ రెండు
జిల్లాల వైపు చూస్తుంది. ఆ రెండు జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా అక్కడి
అధికారులు ఏ విదంగా చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపై డడం యావత్తు దేశాన్నే
ఆకట్టుకుంటోంది. అక్కడ తీసుకుంటున్న చర్యలేంటన్న దాని మీద అని విభాగాలనిపుణుల నుంచి ప్రభుత్వ పెద్దల
వరకూ ప్రతి నిత్యం జిల్లా కలెక్టర్లను ఆరా తీస్తున్నారు. కరోనా ఫ్రీ జిల్లాలుగా
ఉండటంతో జాతీయ మీడియా లో కూడా ఈ రెండు జిల్లాల పేర్లు ప్రముఖంగా
వినిపిస్తున్నాయి.ఆ రెండు జిల్లాలు ఏవి అంటే .. శ్రీకాకుళం విజయనగరం. ఏపీలో కరోనా
తాకని నేలలుగా వాటికి ప్రాచుర్యం లభిస్తోంది.ఇదిలా
ఉండగా పొరుగున ఉన్న ఒడిషా చత్తీస్ ఘడ్ ల నుంచి కరోనా కేసులుఈ వైపునకు వ్యాప్తి చెందకుండా
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఎక్కడికక్కడ చెక్ పోస్టులతో జిల్లా పైకరోనా
నీడ పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే విజయనగరాన్ని కూడా కరోనా
ఫ్రీ జిల్లాగా చేయడంలో ఆ జిల్లా కలెక్టర్హరి
జవహర్ లాల్ తో పాటు మొత్తం జిల్లాఅధికారుల
శ్రమ ఎంతో ఉంది. ఈ నెల 20 వరకూ
ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్ గా కేంద్రం
ప్రకటిస్తుందన్న సమాచారం నేపధ్యంలో ఏపీలో గ్రీన్ జోన్ జిల్లాలుగా రికార్డు
స్రుష్టించేందుకు ఈ రెండు జిల్లాల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏప్రిల్ 20 వరకు ఈ జిల్లాల్లో ఒక్క కేసు
కూడా నమోదు కాకపోతే అక్కడ లాక్ డౌన్ ను సడలింపు చేసే అవకాశం ఉంది.