విజయవాడ ఏప్రిల్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్); కరోనా సాయంగా ప్రతి నిరుపేద కుటుంబానికి
రాష్ట్ర ప్రభుత్వం 5000
వేల రూపాయలు తక్షణ సాయం
అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిరాహార దీక్ష
ప్రారంభించారు. రాష్టంలో కరోనా సోకి మృతి చెందిన ప్రతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియానురాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్
చేశారు.తన నివాసంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న 12గంటలు నిరాహార దీక్ష కార్యక్రమానికిగుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి
కోవెలమూడి నాని సంఘీభావం తెలిపారు.ఆయనతో బాటు తెలుగు యువత నాయకుడు అమరావతి యువజన
జెఏసి కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణ కూడా తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ
డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రావిపాటి సాయి కృష్ణ డిమాండ్
చేశారు.