23 రోజుల ఓ ప‌సికందు ఉన్న‌ట్లు

మహబూబ్ నగర్ (ఆయుధం న్యూస్) :  తెలంగాణ‌లో వైర‌స్ వ్యాప్తి పెరిగిపోతుంది. ఇప్ప‌టికే ఢిల్లీ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారికి క‌రోనా టెస్టులు చేస్తుండ‌గా… వారితో స‌న్నిహితంగా ఉన్న వారికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌స్తుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంది.
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో మ‌ర్క‌జ్ వెళ్లి వ‌చ్చిన క‌రోనా పాజిటివ్ పేషెంట్ తో కాంటాక్ట్ అయిన ముగ్గురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట్రావు అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే…ఇందులో 23 రోజుల ఓ ప‌సికందు ఉన్న‌ట్లు తెలిపారు. దీంతో ప‌ట్ట‌ణంలోని పాజిటివ్ వ‌చ్చిన వారి ప‌రిస‌ర ప్రాంతాల్లో అధికారులు వైర‌స్ వ్యాపించ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు.దీంతో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరింది.