ఫార్మాసిటీలో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేయాలంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. సహజ వాయువు సరఫరా చేయాల్సిందిగా ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. మౌలిక వసతుల కోసం రూ.1318 కోట్లు, సాంకేతిక సదుపాయాలకు రూ.2100 కోట్లు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మాసిటీ ద్వారా రూ.64వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని లేఖలో మంత్రి కేటీఆర్ వివరించారు. తద్వారా 5.60 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్క్‌గా పేర్కొన్నారు. ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిందన్నారు.
