వేట్లపాలెం ఘటనకు కారణాలేమిటి?..సమగ్ర విచారణ జరిపించాలి

 

ఐహెచ్ఆర్ ఏ ఆంధ్ర ప్రదేశ్ సివిల్ రైట్స్ చర్మెన్  కరణం తిరుపతి నాయుడు డిమాండ్

అమరావతి మార్చ్ 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ భారీ విస్పోటనం ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాదితులకు సరైనా న్యాయం చేయాలని ఐహెచ్ఆర్ ఏ ఆంధ్ర ప్రదేశ్ సివిల్ రైట్స్ చర్మెన్  కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేసారు. పేలుడు జరిగిన సమయంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో 40 మంది పని చేస్తున్నట్లు తెలు స్తోందని, వివిధ రూపాల్లో 30 మంది చనిపోయారని, సంఘటన జరిగి 3 రోజులు గడుస్తున్నా మిగిలిన 10 మంది ఏమయ్యారనే ప్రశ్నకు ఇప్పటి వరకూ జవాబు దొరకపోవడం ఆందోళన కర విషయమన్నారు. శనివారం ఘటనా స్థలంలో 20 మం ది సజీవ దహనం కాగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మరణించారు. మరో ఏడు గురు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందు తున్నారు. ఒకరు ప్రమాదం నుంచి తప్పిం చుకున్నారు. ఈ 30 మంది కాకుండా మిగిలిన 10 మంది ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. దీనిని నిర్ధారించాలంటే సీసీ కెమెరాల పుటేజే ఆధారం. ఆ దిశగా అధి కారులు దర్యాప్తు చేస్తారో లేదో ప్రస్నార్దాకంగా మారిందన్నారు.నిబంధనల ప్రకారం ప్రతీ బాణసంచా తయారీ కేంద్రం. షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధన ప్రకారం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు సమా చారం. తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆయన సెల్ఫోన్లో రికా రవుతాయి. ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు పూర్తిగా కాలిపోయినా.. సెల్ఫోన్లో నిక్షిప్తమైన వీడియో దృశ్యాలు లభించే ఆవకాశం ఉంది. ఈ రికార్డులను పరిశీలిస్తే తొలుత విస్పోటనం ఎక్కడ జరిగింది.. ఎక్కడి నుంచిఏవిధంగా మంటలు చెల -దేగాయి.. ఆ సమయంలో అక్కడ ఎంతమంది పని చేస్తున్నారనే అంశాలపై స్పష్టత వస్తుందన్నారు.సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ లైసెన్స్ అడబాల అర్జున్ పేరిట ఉంది. దీని నిర్వహణలో అర్జున్ తో పాటు ఆయన సోదరుడు నానితండ్రి శ్రీనివాసరావు కూడా పాలుపంచుకుంటున్నారని,ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు మరణించగా... అర్జున్నానిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించిన నేపథ్యంలో వారికి నోటీసు ఇచ్చి విడి చిపెట్టామని పోలీసులు చెబుతుండగా.. ఆది అవా స్తవమనితండ్రికి తలకొరివి పెట్టేందుకు కూడా వారిని అనుమతించలేదని కుటుంబ సభ్యులు చెబు తున్నారు. మరోవైపు అన్నదమ్ములిద్దరినీ అదుపు లోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఏ సమాచారం రాబట్టారనే విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగానే ఉంచారని,బాద్యులను తప్పించడానికి రాష్ట్ర హోం మంత్రి యత్నిస్తున్నారని తిరుపతి నాయుడు ఆరోపించారు.