నాగర్ కర్నూల్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణ

 నాగర్ కర్నూలు జిల్లా.... ఆయుధం న్యూస్  


ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణ

* జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత–పరిశుద్ధ కార్యక్రమం

* కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

* స్వయంగా చీపురు పట్టి పాఠశాల ఆవరణలో శుభ్రత పనుల్లో పాల్గొన్న కలెక్టర్

* పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న జిల్లా కలెక్టర్

* పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందుతాయని వ్యాఖ్య

* పాఠశాల పరిశుభ్రతపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచన

* విద్యార్థుల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని పిలుపు

* పాఠశాల పరిసరాల్లో తరచుగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు

* పాఠశాలలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను పరిశీలించిన కలెక్టర్

* కిచెన్ షెడ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

* మధ్యాహ్న భోజన కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు కిచెన్ షెడ్ అవసరం ఉందని వ్యాఖ్య

* ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని కలెక్టర్ వ్యాఖ్య

* కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, వైస్ చైర్మన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు