అమరావతి మార్చ్ 2 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: శాఖల సమర్థత పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల నుంచి 80 శాతం నుంచి 90 శాతం తగ్గకుండా.. పబ్లిక్ పర్షెప్సన్ ఉండాలని అన్నారు. నూతన విధానాల అమలు అంశంపై పలు కీలక శాఖలతో, ఆర్ టిజిఎస్, పిపిపిపై సిఎం సమీక్ష జరిపారు. బాణాసంచా పేలుడు ఘటనలు పునరావృత్తం కాకూడదని, రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై.. సంతృప్తి వ్యక్తమైందని సిఎంకు అధికారులు వివరించారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న..స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెన్షన్ల విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్నచోట.. సమర్థంగా పంపిణీ జరిగేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఆర్టిసి బస్సు సర్వీసులు బావున్నా.. ఆర్టిసి బస్ స్టేషన్ లో..సౌకర్యాలు, ఔట్ సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్ లో టాయిలెట్స్ మరమ్మతులు పూర్తి చేయాలని, బస్ స్టేషన్ కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరేవరకు.. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవినీతికి తావులేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలని, వాట్సప్ మనమిత్ర సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని, నూటికి నూరుశాతం వాట్సప్ సేవల వినియోగం జరగాలని సూచించారు. అన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు.
