హైదరాబాద్ `15 (ఆయుధం న్యూస్ );మహిళ అభ్యున్నతే దేశానికి శ్రీరామరక్ష అని బిజెపి రాష్ట్ర అద్యక్షులు ఎన్.రామచందర్రావు అన్నారు.
ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు మరియు కార్యనిర్వాహక అధ్యక్షురాలు డాక్టర్ శివలెంక నాగ ఉదయలక్ష్మి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరియు సంఘమిత్ర అసోసియేషన్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్ సౌజన్యంతో నిర్వహించించ హైదరాబాద్ అబిడ్స్ సూర్య లోక కాంప్లెక్స్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల లో అభివృద్ధి చెందాలని అప్పుడే దేశము అభివృద్ధి చెందుతుందని అదే దేశానికి శ్రీరామరక్ష అందుకుగాను తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎదురవుతున్న పరిణామాలను చూస్తే నరేంద్ర మోదీ వంటి నాయకులు దేశానికి ఎంత అవసరము ప్రస్తుత యుద్ధ వాతావరణంలో మోడీ అన్ని దేశాలను కలుపుకుంటూ శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలు అనితర సాధ్యం అని తెలిపారువివిధ రంగాల్లో సేవ చేసిన మహిళలను సత్కరించారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాలకృష్ణ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ సభలో సీనియర్ పాత్రికేయులు డాక్టర్ సూర్య ప్రకాష్ అధ్యక్షత వహించారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ అంజని దేవి వివిధ రంగాల్లో సేవ చేసిన మహిళా మణులను పరిచయం చేశారు దివ్యాంగుల నాయకులు గంగారాం నాగభూషణ్ దివ్య సమస్యలను వివరించారు ఈ సందర్భంగా రామచంద్ర రావు ఐపిసి పార్టీ దివ్యంగా విభాగం తెలంగాణ అధ్యక్షురాలు శారదకు కృత్రిమ కాలును అందజేశారు. అలాగే వివిధ రంగాలలో నిష్ణాతులైన 19 మంది మహిళా మూర్తులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మోదీ నాయకత్వంలో బీజేపీ కులమత ప్రాంతాలకు అతీతంగా మహిళా అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించారు.సభకు అధ్యక్షత వహించిన సీనియర్ పాత్రికేయులు ఎస్వీ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ యుద్ధ వాతావరణంలో ప్రధాని మోదీ ప్రదర్శిస్తున్న రాజనీతి అనితర సాధ్యమని ఆయన స్థానంలో ఇంకెవరు ఉన్నా దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉండేదని అన్నారు.ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కే బి శ్రీధర్ మాట్లాడుతూ రామచంద్ర రావు వంటి ప్రతిభాశాలి సాత్వికులు అయిన నాయకులతో కలసి పనిచేయటానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు ఐపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులకు న్యాయం చేస్తూ వారి ప్రయోజనాలను కాపాడే దిశగా ప్రభుత్వం అడుగులువేయలని ఇందుకు రామచంద్రరావు వంటి సమర్థులు చొరవ తీసుకోవాలని కోరారు.అవార్డు గ్రహీతలలో విశాఖ శ్రీకాకుళం నుంచి వచ్చిన అధ్యాపకులు కామేశ్వరి కవయిత్రి శ్రీమణి , ఇంకా సాందీప నీ స్పెషల్ స్కూల్ నిర్వహిస్తున్న లలిత, నాగలక్ష్మి శాంతి విజయవాడనుంచి వచ్చిన సామాజిక కార్యకర్త లోహిత ప్రియ, శ్రేయ వైష్ణవి, కాస్మోలజిస్ట్ డాక్టర్ అక్షయ, సామాజిక సేవకురాలు కత్తుల పద్మ, సంతోషి కమలా ప్రకాశ్ శుభా కర్రా భావిక ప్రియ తదితరులు ఉన్నారుఅంతకుముందు ప్రముఖ బహుభాషా గాయకుడు లలిత సినీ సంగీత శిక్షుకుబారి కాంతారావు తంపా మధురమైన గీతలతో అలరించారు.ఈకార్యక్రమంలో ఐపిసి మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పద్మిని జనరల్ సెక్రటరీ పుష్పాంజలి దివ్యాంగ విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శారద మరియు ఐపీసీ పార్టీ కార్యవర్గ సభ్యులు దశరథం నాదెండ్ల సుధాకర్ వాసుదేవరావు రూపా దేవి అల్లాజీ విజయ కనుక దుర్గ కవిత శ్రీనివాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.