సరికొత్త జియోఫైనాన్స్ యాప్ కోసం ‘ఫిన్సైడర్’ అనే ఎర్లీ యాక్సెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. వినియోగదారుల జీవన సందర్భం ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన సిఫారసులతో, ఫైనాన్స్‌ను మరింత వ్యక్తిగత అనుభవంగా మార్చేలా ఈ యాప్ రూపుదిద్దుకుంది. ‘ఫిన్సైడర్లు’ యాప్‌ను ముందుగానే వినియోగించి, తమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా జియోపాయింట్స్* సంపాదించవచ్చు. ఈ పాయింట్లను విస్తృతమైన రివార్డ్స్ క్యాటలాగ్‌లోని బహుమతులపై రీడీమ్ చేసుకునే అవకాశం వారికి లభిస్తుంది.
ముంబై, ఆయుధం న్యూస్ March 2nd, 2026: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జె.ఎఫ్.ఎస్.ఎల్.)కు పూర్తిగా అనుబంధ సంస్థగా ఉన్న జియో ఫైనాన్స్ ప్లాట్‌ఫార్మ్ అండ్ సర్వీస్ లిమిటెడ్ (జె.ఎఫ్.ఎస్.ఎల్.) భారత ఆర్థిక రంగానికి కొత్త దిశను చూపించేందుకు సిద్ధమవుతోంది. సరికొత్త జియోఫైనాన్స్ యాప్ ఆవిష్కరణతో ఆర్థిక సేవల అనుభవాన్ని మరింత స్మార్ట్, సులభం, వ్యక్తిగతీకరించిన రూపంలో అందించనుంది. ‘ఫిన్సైడర్’ అనే ప్రత్యేక ఎర్లీ యాక్సెస్ కార్యక్రమం ద్వారా వినియోగదారులకు ఈ యాప్‌ను ముందుగానే అనుభవించే అరుదైన అవకాశం లభిస్తుంది. అంతేకాక, తమ అభిప్రాయాలు మరియు సూచనలను పంచుకోవడం ద్వారా యాప్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావచ్చు. తెలివైన ఫైనాన్స్ శక్తిని మీ చేతుల్లోకి తీసుకువచ్చే ఈ ప్రయత్నం, భారత ఆర్థిక ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.
సాంప్రదాయ పద్ధతిలో ఆర్థిక ఉత్పత్తులను సాధారణంగా జాబితా చేయడాన్ని దాటి, ఈ కొత్త యాప్ ఏజెంటిక్ ఎఐ మరియు న్యూరల్ వర్క్స్ శక్తిని వినియోగించే నెట్‌వర్క్‌లను ఎక్కువగా వినియోగించడం వ్యక్తిగతీకరించిన, క్షణాల్లో స్పందించే, ఎప్పుడూ అందుబాటులో ఉండే ఫైనాన్షియల్ అనుభవాన్ని అందిస్తుంది.
దీనితో వినియోగదారులు తమ ఆర్థిక భవిష్యత్తుపై పూర్తి నియంత్రణ సాధించి, ధైర్యంగా మరియు నమ్మకంతో తీసుకునే శక్తిని పొందగలుగుతారు.
ప్రస్తుతం సరికొత్త జియోఫైనాన్స్ యాప్‌లో అందుబాటులో ఉన్న ముఖ్య ఫీచర్లు:
ఇంటెలిజెంట్ ఫైనాన్స్ మార్కెట్‌ప్లేస్: జె.ఎఫ్.ఎస్.ఎల్. గ్రూప్ కంపెనీలు మరియు విశ్వసనీయత ఆర్థిక బ్రాండ్‌ల నుంచి విభిన్నమైన ఉత్పత్తులను ఒకే డిజిటల్ వేదికపై అందించే విస్తృత మార్కెట్‌ప్లేస్. ఇందులో గృహ రుణాలు, సెక్యూరిటీలపై రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్, యు.పి.ఐ. సేవలు, జీవిత మరియు జనరల్ ఇన్సూరెన్స్, జియోబ్లాక్ రాక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అందించే మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సేవలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డిజిటల్ గోల్డ్, పన్ను ఫైలింగ్ మరియు ప్రణాళిక సేవలు ఉన్నాయి. అదనంగా, అధిక లాభాల కోసం ఆటోమేటెడ్ లిక్విడిటీ మేనేజ్‌మెంట్ సౌకర్యవంతమైన లాభాలతో కూడిన వినత్న సేవింగ్స్ అకౌంట్ కూడా ఇందులో భాగంగా అందుబాటులో ఉంది ఉంది.
వ్యక్తిగతీకరించిన సిఫారసులు: సాధారణ ఆఫర్లను కేవలం జాబితా చేయడం నుంచి ముందుకు వెళ్లి, వినియోగదారులకు ఉత్తమ ఫలితాలు అందించేందుకు ఈ యాప్ తెలివైన నిర్ణయాలను స్వయంగా లెక్కించి అందిస్తుంది. 15 ఎఐ ఏజెంట్లు మరియు సుమారు 70 నిర్ణయాత్మక ఇంజిన్లతో విస్తరిస్తున్న శక్తివంతమైన ఎకోసిస్టమ్ ఆధారంగా, ఇది వినియోగదారుల రియల్-టైమ్ ఉద్దేశం, అర్హత, మరియు ఆర్థిక నేపథ్యాన్ని విశ్లేషిస్తుంది. ఆ విశ్లేషణ ఆధారంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా సరిపోయే సిఫారసులను అందించి, వారి ఆర్థిక నిర్ణయాలను మరింత సమర్థవంతంగా మారుస్తుంది.
డైనమిక్ పర్సనలైజేషన్:
‘అందరికీ ఒకే విధానం’ అనే పాత విధానాన్ని అధిగమిస్తూ, సరికొత్త జియోఫైనాన్స్ యాప్ స్థిరమైన పేజీలకు పూర్తిగా ముగింపు పలుకుతుంది. వినియోగదారుల ఆర్థిక ప్రొఫైల్‌లు మరియు అవసరాలు భిన్నంగా ఉంటే, వారి హోమ్ స్క్రీన్ కూడా భిన్నంగానే కనిపించేలా ఈ యాప్ రూపుదిద్దుకుంది. అంటే, ఒకరి అనుభవం మరొకరికి సరిపోలదు. ప్రతి వినియోగదారికి వారి అవసరాలకు తగినట్లుగా ప్రత్యేకంగా రూపొందించిన వ్యక్తిగత ఫైనాన్షియల్ డ్యాష్‌బోర్డ్ అందుతుంది.
నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్: వినియోగదారులు తమ ప్రత్యేక ఆర్థిక అవసరాలను చాట్ బార్‌లో సులభంగా టైప్ చేస్తే చాలు, అందుకు సంబంధిత ఉత్పత్తులు, సేవలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. అంతులేని స్క్రోలింగ్ అవసరం లేకుండా, అనేక యాప్ స్క్రీన్ల మధ్య మారాల్సిన ఇబ్బందులు లేకుండా, ఒకే చోట సహజమైన సంభాషణ తరహాలో ఫైనాన్షియల్ పరిష్కారాలను కనుగొనే సౌలభ్యం ఈ ఫీచర్ అందిస్తుంది.
జియోపాయింట్స్:
యాప్‌లో చేసే ప్రతి లావాదేవీకి వినియోగదారులు జియోపాయింట్స్ సంపాదించుకునే సమగ్ర రివార్డ్స్ ప్రోగ్రామ్ ఇది. ఈ పాయింట్లను తమ అభిరుచికి అనుగుణంగా విస్తృతమైన రివార్డ్స్ క్యాటలాగ్‌లోని బహుమతులపై రీడీమ్ చేసుకోవచ్చు. సాధారణ స్క్రాచ్ కార్డుల పద్ధతికి బదులుగా, వినియోగదారులకు నిజంగా ఉపయోగపడే, ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో కూడిన రివార్డ్స్ అనుభవాన్ని ఇది అందిస్తుంది.
త్వరలో అందుబాటులోకి రానున్న అదనపు ఫీచర్లు:
ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ స్కోర్: వినియోగదారుడి ఆర్థిక ఆరోగ్యాన్ని సమగ్రంగా అంచనా వేయడానికి రూపొందించిన ప్రత్యేక సూచిక ఇది. వ్యయాలు, అప్పులు, బీమా రక్షణ, సంపద సృష్టి ప్రణాళికలు, అలాగే ట్యాక్స్ కంప్లయెన్స్ వంటి ముఖ్య అంశాలను విశ్లేషించి, వ్యక్తి ఆర్థిక స్థితిని స్పష్టంగా తెలియజేస్తుంది. దీనివల్ల వినియోగదారులు తమ బలాలు–బలహీనతలను గుర్తించి, మరింత మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం పొందుతారు.
పర్సనల్ సి.ఎఫ్.ఓ ఫర్ భారత్: సంభాషణాత్మక ప్రయాణం ద్వారా జియోఫైనాన్స్ ప్రతి వినియోగదారుడికి వ్యక్తిగత ఆర్థిక మార్గదర్శకుడిలా మారుతుంది. వారి మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి అవసరమైన అమలు చేయగల సూచనలను అందించడంతో పాటు, ఆ సూచనలను అమలు చేసేందుకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తుంది. ఈ విధంగా, ప్రతి భారతీయునికి తమ స్వంత “పర్సనల్ CFO” లాంటి అనుభవాన్ని అందిస్తూ, ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించి, నమ్మకంతో సాధించే దిశగా మార్గనిర్దేశం చేస్తుంది.
ఆటోనమస్ ఎగ్జిక్యూషన్: సంభాషణాత్మక ప్రయాణం ద్వారా, కేవలం కొన్ని సులభమైన క్లిక్స్‌తోనే వినియోగదారులు తమ లావాదేవీ ప్రక్రియలను ఆటోమేట్ చేసుకునే సౌకర్యాన్ని పొందగలుగుతారు. పునరావృత చెల్లింపులు, క్రమానుసార పెట్టుబడులు వంటి ఆర్థిక కార్యకలాపాలను స్వయంచాలకంగా నిర్వహించే విధంగా సెటప్ చేసుకోవచ్చు. దీంతో సమయం ఆదా కావడమే కాకుండా, చెల్లింపులు లేదా పెట్టుబడులు మిస్ కాకుండా, క్రమబద్ధమైన ఆర్థిక నిర్వహణ సాధ్యమవుతుంది.
ఎక్స్‌క్లూజివ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్: జియోఫైనాన్స్ యాప్ ద్వారా వినియోగించే ఉత్పత్తులు లేదా సేవలపై సభ్యులు ఖచ్చితమైన విలువ-బ్యాక్ పొందగలుగుతారు. ప్రతి లావాదేవీతో ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించే ఈ ప్రత్యేక మెంబర్‌షిప్ ప్రోగ్రామ్, వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందిస్తూ, వారి ఆర్థిక ప్రయాణాన్ని మరింత లాభదాయకంగా మార్చుతుంది.
హితేష్ సేథియా, మేనేజింగ్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, మాట్లాడుతూ, “తెలివైన ఆర్థిక సేవలు ప్రతి పౌరుడి మౌలిక హక్కుగా ఉండాలి అని మేము నమ్ముతున్నాము. ఫైనాన్స్ రంగంలో జరుగుతున్న ఈ మహత్తర మార్పుతో, మేము నిర్మించే ప్రతి పరిష్కారంలో ‘భారత్’ను కేంద్రబిందువుగా ఉంచుతున్నాము. హైపర్-పర్సనలైజ్డ్ మరియు ఇంటెలిజెంట్ ఫైనాన్షియల్ మార్కెట్‌ప్లేస్‌గా రూపొందించిన ఈ సరికొత్త జియోఫైనాన్స్ యాప్, క్లిష్టమైన ఆర్థిక ప్రపంచంలో ముందుకు సాగేటప్పుడు ఎదురయ్యే అనవసర గందరగోళం మరియు అడ్డంకులను తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షపాతం లేని, అమలు చేయగల ఆర్థిక అవగాహనను ప్రతి భారతీయుడికి అందిస్తూ, పారదర్శకత మరియు నమ్మకంతో తమ ఆర్థిక భవిష్యత్తుపై నియంత్రణ సాధించేలా శక్తినివ్వడానికి ఈ వేదిక రూపుదిద్దుకుంది” ఇలా అన్నారు:
ఫిన్సైడర్ గా మారేందుకు, https://bharat.jiofinance.in/ వద్ద నమోదు చేసుకుని, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా జియోఫైనాన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి లేదా అప్‌డేట్ చేసుకోండి. ప్లాట్‌ఫారమ్‌తో సక్రియంగా భాగస్వామ్యం అవుతూ, యాప్‌లోని ఫీడ్‌బ్యాక్ ఫారమ్ ద్వారా మీ అభిప్రాయాలను పంచుకోండి. యాప్‌లో చేసే ప్రతి లావాదేవీపై జియోపాయింట్స్* సంపాదించి, వాటిని విభిన్న రివార్డ్స్ కోసం రీడీమ్ చేసుకునే అవకాశం పొందండి.