ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు సిద్ధంరెడ్డి శివ శంకర్ రెడ్డి డిమాండ్
విజయవాడ మార్చ్ 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );అంగన్వాడీ సిబ్బందికి న్యాయం చేయాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది .విజయవాడలో మీడియా సమావేశం లో పార్టీ రాష్ట్ర అద్యక్షులు సిద్ధంరెడ్డి శివ శంకర్ రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ జాలాది చంద్రనంద్ తో కలిసి మాట్లాడారు.రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్న సమయంలో, వారి డిమాండ్లు నెరవేరకముందే ప్రభుత్వం పత్రికల్లో ప్రచారం చేయింఛి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సర్వీస్ బెనిఫిట్స్‌పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక జి.ఓ లేదా గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. అయినా సమస్యలు పరిష్కరించామన్నట్టుగా ప్రచారం చేయడం ప్రజలను, అంగన్వాడీలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన దుయ్య బట్టారు.అంగన్వాడీ సిబ్బంది గర్భిణీ స్త్రీలు, బాలింతల పర్యవేక్షణ, చిన్నారులకు పోషకాహార పంపిణీ, ప్రీ-స్కూల్ విద్య, ఇంటింటి సర్వేలు, డేటా నిర్వహణ, ఆరోగ్య & టీకా కార్యక్రమాల సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, విపత్తుల సమయంలో సేవలు — ఇంత విస్తృతమైన సేవలు అందిస్తున్నప్పటికీ, వారి వేతనాలు తక్కువ స్థాయిలో ఉండటం అన్యాయమన్నారు. మాటల ప్రచారం కాదు – అధికారిక ఉత్తర్వులు కావాలి.పత్రికల ప్రకటనలు కాదు – భూమిపై అమలు కావాలని డిమాండ్ చేసారు.1. అంగన్వాడీ వర్కర్లకు ₹26,000 కనీస జీతం వెంటనే అమలు చేయాలి.2. అంగన్వాడీ హెల్పర్లకు ₹20,000 జీతం నిర్ధారించాలి.3. శాశ్వత ఉద్యోగ హోదా కల్పించాలి.4. పెన్షన్, ఈఎస్‌ఐ, మెడికల్ సదుపాయాలు కల్పించాలి.5. పదోన్నతులు, సర్వీస్ బెనిఫిట్స్ స్పష్టంగా ప్రకటించాలి.6. పై అంశాలన్నింటిపై తక్షణమే అధికారిక జి.ఓ విడుదల చేయాలని డిమాండ్ చేసారు.