హైదరాబాద్ మార్చ్ 17 (ఆయుధం న్యూస్ );: రాష్ట్రంలోని మహిళలను మహాలక్ష్ముల్లా గౌరవిస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించడం సరికాదని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా భట్టి మాట్లాడారు. నియోజక వర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, పేదల ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనేది లెక్కలతో చెబుతామని, గతంలో పెండింగ్ పెట్టిన వడ్డీ లేని రుణాలను తాము క్లియర్ చేస్తున్నామని అన్నారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, బిఆర్ఎస్ వాళ్లు ఎన్ని అడ్డుంకులు సృష్టించినా వడ్డీలేని రుణాలు ఇచ్చి తీరుతామని భట్టి పేర్కొన్నారు.
