పిల్లలను చెరువులోకి తోసి తల్లి ఆత్మహత్య ..కర్నూలు జిల్లాలో దారుణం


అమరావతి మార్చ్ 14 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);: ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో    ఓ తల్లి ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య   చేసుకుంది. శనివారం ఉందయం కర్నూలు సమీపంలోని గార్గేయపురం రాజేశ్వరి(35) అనే వివాహిత తన ఇద్దరు కుమారులు అబ్రహం(3),సుకుమార్‌(6)ను చెరువు లోకి తోసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.