సైదాబాద్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో 19 నుండి 27 వరకు శ్రీరామనవమి మహోత్సవాలు

9 రోజుల పాటు  ప్రతి రోజు భక్తులకు ఉచితంగా శివాభి శేఖంనవగ్రహభి శేఖం  సౌకర్యం


హైదరాబాద్ మార్చ్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ( శివ సాయి మందిరం) సైదాబాద్ లోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ  రోడ్ నెంబర్ 4 లో ఈ నెల 19 నుండి 27 వరకు శ్రీరామనవమి మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు షిరిడి సాయి సేవా సమితి ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివ్య విశ్వ శక్తి  పీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ ఓం స్వరూపాజీ స్వామీజీతో కలిసి ఆలయ కమిటీ  కార్యదర్శి పి సుబ్రహ్మణ్య శాస్త్రి, కోశాధి కారి పి రామకృష్ణ, ఎన్ ప్రసాదరావు,కైలాస్ శ్రీధర్  మాట్లాడారు. ముఖ్యంగా ఉగాది పర్వదినం 19 తేది నుండి 27 వరకు 9 రోజుల పాటు  ప్రతి రోజు భక్తులకు ఉచితంగా శివాభి శేఖం, నవగ్రహభి శేఖం  సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. 27 వ తేది  ఉదయం 6:30 లకు బాబాకు, సీతారాములకు పాలాభిషేకం, 8:00 గంటలకు భక్తులచే బిక్షాటన 9:30 కు సీతారాముల కళ్యాణం, 12:30 సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ విందు భోజనం రాత్రి 8 గంటలకు సీతారాముల రాథోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయని వారు వెల్లడించారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.