బ్రాహ్మణ పరిషద్ కార్యవర్గం లో శ్రీ వైష్ణవులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలి

   శ్రీ వైష్ణవ రాష్ట్ర సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు తిరువరంగం ప్రభాకర్ డిమాండ్


హైదరాబాద్ సెప్టెంబర్ 5 (ఆయుధం  న్యూస్ );ప్రభుత్వం త్వరలో నియామకం చేయబోయే " బ్రాహ్మణ పరిషద్ " కార్యవర్గం లోశ్రీ వైష్ణవులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలనిముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లకు "శ్రీ వైష్ణవ రాష్ట్ర సేవా సంఘం విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు సంఘ రాష్ట్ర అధ్యక్షులు తిరువరంగం ప్రభాకర్ప్రధాన కార్యదర్శిపీచర కృష్ణ ఒక ప్రకటనవిడుదల చేసారు.  రాష్ట్రం లోశైవ ఆలయాల తో సమానంగావైష్ణవ ఆలయాలు కూడా ఉన్నాయనిసంఖ్యా బలంలో కూడాశ్రీ వైష్ణవులు బ్రాహ్మణులతో సమంగా ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. శ్రీ వైష్ణవులకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించడం ద్వారారాష్ట్రం లో వైష్ణవ సాంప్రదాయన్ని అనుసరించే కొట్లాది మందిని గౌరవించినట్లు అవుతుందని పేర్కొన్నారు