తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి
హైదరాబాద్ సెప్టెంబర్ 5 (ఆయుధం న్యూ స్ )మానవ సమాజంలోని మంచి చెడులను ఎంచి చూపిస్తూ జీవన పరమార్థం మంచితోనే సార్ధకత నొందుతుందని డాక్టర్ తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు కె వి రామణాచారి అన్నారు. కమలాకృష్ణ కళా కౌముది సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత వీరపూర్ణ చందర్రావు రచించిన ‘బంగారు తీగ’ నవల ఆవిష్కరణ కార్యక్రమం మాసబ్ ట్యాంక్ నఫీజ్ మంజీల్లో జరిగింది.ప్రమ్హుఖ సాహితి వేత్త డాక్టర్ జయ రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ డాక్టర్ కె.వి.రమణాచారి ముఖ్యఅతిథిగా విచ్చేసి ‘బంగారు తీగ’ గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ వ్యసనాల నుంచి దుర్మార్గాల నుంచి మనిషి మనిషి సత్కారం వైపు వెళ్ళినప్పుడే జాతికి శ్రేయస్సు చేకూరుతుందన్నారు మాదక ద్రవ్యాల వాడకాన్ని ధైర్యంగా నిరోధించి మంచి మార్గాన పయనింపజేసే కథానాయకుడి పాత్ర అభినందనీయం అన్నారు. ఈ సభలో సాహితి కిరణం పత్రిక ఆధిపతులు కొత్తూరు సుబ్బారావు, జయలక్ష్మి దంపతులు అతిథులుగా పాల్గొని గ్రంథ విశిష్టతను వివరించారు. గ్రంధకర్త వీరపూర్ణ చందర్రావును ఈ సందర్భంగా అతిథులు ఘనంగా సత్కరించారు.గ్రంధకర్త తన స్పందన తెలియజేస్తూ డాక్టర్ పొతుకుచి రాంబశివరావు ఇచ్చిన స్ఫూర్తి ప్రోత్సహంతోనే తన నవల ప్రస్థానం ప్రారంభమైందని వారికి నివాళులర్పించారు. సభా కార్యక్రమానికి ముందు బ్రాహ్మణపల్లి జయరాములు అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో లలిత చండీ, పెద్దూర్ వెంకట దాసు, పనిభూషణ్, డాక్టర్ లలిత వాణి, డాక్టర్ కోదాడ రరుణ, గొల్లపల్లి ఆంజనేయులు, కే లలిత, డాక్టర్ నాగేశ్వరరావు, ఉమ్మడి సింగ్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు